ఆంధ్రప్రదేశ్‌

ఎస్సీల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు టౌన్, జూన్ 17: ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి నక్కా ఆనందబాబు తెలిపారు. ఈనెల 30వ తేదీన నెల్లూరులో నిర్వహించనున్న దళిత తేజం-తెలుగుదేశం కార్యక్రమానికి ముఖ్యమంత్రి విచ్చేస్తున్న సందర్భంగా ఆదివారం నగర టీడీపీ కార్యాలయంలో సన్నాహాక సమావేశాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి నక్కా మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లయినా ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయనివిధంగా ఎస్సీ ఎస్టీల కోసం నాలుగేళ్లలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ రద్దు చేయాలనుకున్న బీజేపీకి ఎదురొడ్డి ఆ జీవోను రద్దు చేయకుండా రాష్టప్రతి దృష్టికి తీసుకెళ్లిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. జగ్జీవన్‌రాం పేరుతో ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. అంతేకాక ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రెండేళ్ల క్రితం విదేశీ విద్య కోసం పదిలక్షల రూపాయలను అందిస్తున్నామని, దానిని ఈ ఏడాది రూ.15లక్షలకు పెంచినట్లు చెప్పారు. దివంగత రాజశేఖరరెడ్డి హయాంలో రూ.22వేల కోట్లను ఎస్సీ, ఎస్టీ నిధుల కింద మంజూరు చేశారని, రూ.16వేల కోట్లను ఇడుపులపాయకు మళ్లించి అక్కడ రోడ్లు, రింగురోడ్లు ఏర్పాటు చేసుకుని ఎస్సీలకు మొండిచేయి చూపించారన్నారు. రాజధానిలో 20 ఎకరాల్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని, స్మృతివనాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. భూమిలేని ఎస్సీ, ఎస్టీల కోసం రాష్టవ్య్రాప్తంగా భూములను కొని భూమి లేని పేదలకు వాటిని అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి కార్యకర్త దళిత తేజం- తెలుగుదేశం కార్యక్రమం సందర్భంగా ప్రతి ఇంటిని సందర్శించి వారందరికీ సంక్షేమ ఫలాలను అందించి తెలుగుదేశం వైపు చూసేలా దిగ్విజయంగా నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైందన్నారు.