ఆంధ్రప్రదేశ్‌

మరో 50 జూనియర్ కళాశాలలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 17: ప్రభుత్వ రంగంలో విద్యను ప్రోత్సహించేందుకు టీడీపీ ప్రభుత్వం విస్తృత ప్రాధాన్యం ఇస్తోందని మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విశాఖ శివారు అగనంపూడిలో రూ.2.3 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనాలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ విద్యా రంగంలో ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. భవిష్యత్‌లో రాష్ట్రంలో 15 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, 50 జూనియర్ కళాశాలలు, మరో 10 పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. విద్యా వ్యవస్థలో మార్పు రావాలంటే ఈ రంగం పటిష్ఠంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్రాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా, నాలెడ్జ్ సెంటర్‌గా తీర్చిదిద్దుతామని చెప్పారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యా ప్రాంగణాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతున్నామని, పాఠశాలలకు అవసరమైన ఫర్నిచర్, మరుగుదొడ్లు, మంచినీరు, వంటగదులు, ఆటస్థలాలు తదితర వౌలిక సదుపాయాలు కల్పించేందుకు రూ.5వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. హైబ్రిడ్ ఎన్విటీ మోడల్‌లో కేజీ నుంచి పీజీ వరకూ పూర్తి వసతులతో కూడిన భవనాలు నిర్మించనున్నట్టు తెలిపారు. వౌలిక సదుపాయాలే కాకుండా, విద్యా బోధనలో కీలకమైన ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.
టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత తొలిదశలో 10,300 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందని, తాజాగా మరో 10వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనుందన్నారు. రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉన్నప్పటికీ విద్యారంగానికి రూ.25వేల కోట్లు కేటాయించారని, మొత్తం బడ్జెట్‌లో ఇది 16 శాతంగా పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

చిత్రం..విశాఖలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రారంభిస్తున్న మంత్రి గంటా శ్రీనివాసరావు