ఆంధ్రప్రదేశ్‌

సీఎం రమేష్‌ది వంచన దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 1: కడప ఉక్కు కర్మాగారం కోసం చేసిన దీక్షలకు సేకరించిన నిధులు, చేసిన ఖర్చులు, మిగిలిన డబ్బు వివరాలను శే్వతపత్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలని భారతీయ జనతా యువమోర్చా డిమాండ్ చేసింది. ఇక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో యువమోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగోతి రమేష్‌నాయుడు మాట్లాడుతూ కడపలో ఉక్కు కర్మాగారం కోసమని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేసినది వంచన దీక్ష అని విమర్శించారు. ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు కడప జిల్లా బీజేపీ నాయకుల సమక్షంలో ఉక్కు శాఖ మంత్రి బీరేంద్రసింగ్‌తో చర్చించినపుడు కడపలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం రమేష్ ఆ ప్రతిఫలం ముందుగా తనకు దక్కాలని భావించి నిరాహార దీక్ష చేపట్టారని విమర్శించారు. దీనికోసం కార్పొరేట్ సంస్థల నుంచి భారీగా వసూలు చేసిన నిధుల్లో ఎంత ఖర్చు పెట్టారు, ఎంత మిగిలిందనేది ప్రజలకు తెలియచెప్పాలన్నారు. ఈ దీక్షను అల్లూరి, పొట్టి శ్రీరాములు చేసిన దీక్షలతో చంద్రబాబు పోల్చడం సరికాదని, దీనికి వారి దీక్షలకూ పోలికే లేదన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో చంద్రబాబు దళిత లబ్ధిదారులకు కార్లు ఇచ్చి తన పథకంగా ప్రచారం చేసుకుంటున్నారని ఆయన దుయ్యబట్టారు. దళితులకు మేలుచేసేది మోదీనే అన్నారు. స్టాండప్ ఇండియా పథకం ద్వారా దళితులను పారిశ్రామికవేత్తలుగా మార్చుతున్నారన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తే ప్రతిఘటిస్తామని టీడీపీ శ్రేణులను రమేష్‌నాయుడు హెచ్చరించారు.
నవ నిర్మాణ దీక్షల పేరుతో చంద్రబాబు ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని బీజేపీ మైనార్టీ మోర్చా జాతీయ కార్యదర్శి షేక్ బాజీ విమర్శించారు. ఇందుకు ఈ ఏడాది రూ. 138 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కేంద్ర నిధులను అడ్డగోలుగా వాడుకుని జల్సా చేస్తున్నారని ఆక్షేపించారు. బీజేపీతో కలిసినందుకు ముస్లింలకు క్షమాపణ చెబుతూ చంద్రబాబు మైనార్టీలను మభ్యపెడుతున్నారన్నారు. విలేఖరుల సమావేశంలో యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కాల రజనీకాంత్ పాల్గొన్నారు.