ఆంధ్రప్రదేశ్‌

మేమంతా ఒకే కుటుంబం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 1: కానిస్టేబుల్ అయినా, ఎస్పీ అయినా తామంతా ఒకటే కుటుంబమని, కుటుంబ పెద్దగా సిబ్బంది సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత తనపై ఉందని ఏపీ నూతన డీజీపీ ఆర్పీ ఠాకూర్ అన్నారు. గుంటూరు విద్యానగర్‌లోని పోలీసు క్వార్టర్లను ఆదివారం సందర్శించి పోలీసు కుటుంబాలతో కొద్దిసేపు గడిపారు. క్వార్టర్లు శిథిలావస్థకు చేరాయని, నూతన క్వార్టర్స్ నిర్మించాలని పోలీసు కుటుంబ సభ్యులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం డీజీపీ ఠాకూర్ విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులది ఒకే కుటుంబమని, కష్టసుఖాలను పంచుకుంటూ సమస్యలను త్వరలోనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. డీజీపీగా పదోన్నతి పొందిన తర్వాత తన మొదటి సందర్శనను పోలీసు కుటుంబాలతోనే శ్రీకారం చుట్టడం ఆనందంగా ఉందన్నారు. ప్రజల కోసం, ప్రభుత్వం కోసం పనిచేస్తూ శాంతిభద్రతలను పరిరక్షిస్తామన్నారు. రాష్టవ్య్రాప్తంగా పర్యటించి ఎక్కడైతే పోలీసు క్వార్టర్లు మరమ్మతులకు గురై అధ్వానస్థితిలో ఉన్నాయో గుర్తించి నూతనంగా నిర్మించేందుకు కృషి చేస్తామని ఠాకూర్ చెప్పారు. డీజీపీ వెంట అర్బన్, రూరల్ ఎస్పీలు సీహెచ్ విజయారావు, సీహెచ్ వెంకటప్పల నాయుడు పాల్గొన్నారు.

చిత్రం..గుంటూరులోని క్వార్టర్లలో సిబ్బంది సమస్యలు
తెలుసుకుంటున్న డీజీపీ ఆర్పీ ఠాకూర్