ఆంధ్రప్రదేశ్‌

9న రష్యాకు చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: నవ్యాంధ్రకు పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా టిడిపి అధినేత ఎపి సిఎం నారా చంద్రబాబునాయుడు చేస్తున్న విదేశీ పర్యటనలు సత్ఫలితాలనే ఇస్తున్నాయి. ఈ మేరకు ఇటీవల చైనాలో ఐదు రోజుల పాటు పర్యటించి వచ్చిన చంద్రబాబు త్వరలోనే వేలాది కోట్ల మేర పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నట్టు ప్రకటించారు. తాజాగా మరో కీలక దేశం రష్యాలో పర్యటించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇండస్ట్రియల్ నెట్ థీమ్‌తో రష్యాలో జరగనున్న అంతర్జాతీయ ట్రేడ్ ఫెయిల్ ఇన్నోప్రోమ్ 2016లో పాల్గొనేందుకు చంద్రబాబు నిర్ణయించారు. ఈ నెల 10 నుండి 14 వరకూ రష్యా నగరం ఎకతెరిన్‌బర్గ్‌లో జరిగే ఈ సదస్సుకు చంద్రబాబుతో పాటు మహారాష్ట్ర, రాజస్థాన్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, వసుంధర రాజే కూడా హాజరవుతారు. అయితే ఈ ట్రేడ్ ఫెయిర్‌కు ఎపినే కంట్రీ పార్టనర్‌గా వ్యవహరిస్తోంది. ఈ సదస్సు కోసం చంద్రబాబు ఈ నెల 9నే రష్యా వెళ్తారు. ఈ పర్యటనలో భాగంగా రష్యా ప్రధాని మెద్వెదేవ్, ఆదేశ వాణిజ్య పరిశ్రమల మంత్రి ఎకతెరిన్‌బర్గ్ గవర్నర్లతో చంద్రబాబు భేటీ అవుతారు.
కృష్ణా పుష్కరాలకు 116 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం నాడు ఉత్తర్వులు విడుదల చేసింది. పుష్కర పనులకు 232 కోట్లు ఖర్చవుతుందని తొలుత అంచనా వేశారు. అందులో భాగంగా 50 శాతం నిధులను విడుదల చేస్తూ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఆర్ కరికల్ వలవెన్ ఉత్తర్వులు విడుదల చేశారు.

విద్యా నగరంగా అమరావతి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జూలై 4: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విద్యానగరంగా రూపుదిద్దుకునే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అంతర్జాతీయ ఖ్యాతి గడించిన విద్యాసంస్థలకు 455 ఎకరాల భూమిని కేటాయించింది. ఎయిమ్స్, ఐఐటి, ఐఐఎం వంటి అనేక విద్యాసంస్థలు భూ కేటాయింపులకు ఇప్పటికే అనేక విజ్ఞప్తులు చేశాయి. అభ్యర్ధనలను అధ్యయనం చేసిన ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు సిఇఓ పలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించారు. ఆ క్రమంలో ప్రభుత్వం ప్రతిపాదనలను పరిశీలించేందుకు మంత్రుల కమిటీని నియమించింది. మంత్రుల కమిటీ 11 ప్రతిపాదనలను పరిశీలించి అందులో ఆరు ప్రతిపాదనలకు సానుకూల స్పందన వ్యక్తం చేసింది. ఇండో -యుకె ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్, హ్యుమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ ఇనిస్టిట్యూట్, సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ , వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలకు ఆమోద ముద్ర వేసింది. ఇండో యుకె ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌కు 150 ఎకరాల భూమిని ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు గానూ ఎకరాకు 50 లక్షల రూపాయిలు చెల్లించాలని తొలి దశలో 50 ఎకరాలు, రెండో దశలో ప్రభుత్వం వంద ఎకరాలు కేటాయిస్తుంది. అమరావతిలో 20 శాతం పడకలను ఉచితంగా పేదలకు కేటాయించాల్సి ఉంటుంది. అలాగే స్థానికంగా ఉన్న ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలతో అనుసంథానం చేయాలి, వెల్లూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి రెండు దశల్లో 200 ఎకరాలు కేటాయిస్తారు. ఐదేళ్ల వ్యవధిలో 18వేల మంది విద్యార్ధులకు సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది.