ఆంధ్రప్రదేశ్‌

ఢంకా బజాయించి చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: ఎన్నికల మేనిఫెస్టోలో అన్నింటినీ నెరవేర్చామని, చెప్పనివి కూడా చేశామని, ఎవరైనా అడిగితే దబాయించి చెప్పాలని, చెప్పిన దానికన్నా అధికంగా చేశామని చెప్పాలని పార్టీ నేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేశారు. పోలవరం ప్రాజెక్టుపై లేనిపోని అనుమానాలు పెంచి, ఆ ప్రాజెక్టును బలిపశువును చేసే యత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు. ఉండవల్లిలోని తన నివాసం టీడీపీ నేతలకు గురువారం వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడి జూలై 16 నాటికి 1500 రోజులు అవుతుందన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు మరింత చేరువ కావాలన్నారు. నాలుగేళ్లలో సాధించినదీ, భవిష్యత్తులో ఏం చేస్తామనే దానిని ప్రజలకు వివరించాలని సూచించారు. 16 వేల కోట్ల రూపాయల ఆర్థిక లోటు, హేతుబద్ధత లేని రాష్ట్ర విభజన, విశాఖలో హుదూద్ తుపాను బీభత్సం వంటి ఎన్నో ఇబ్బందులను అధిగమించామన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పవర్ హాలీడేస్‌తో నెలలో 15రోజుల పరిశ్రమల మూత, పోలీస్ స్టేషన్లలో ఎరువుల పంపిణీ, లాఠీ దెబ్బ తింటేనే రైతుకు ఎరువుల బస్తా దక్కడం వంటి అరాచకాలతో ఏపీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీశారన్నారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞం చేశారని, 300 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారని గుర్తు చేశారు. ఒక కుటుంబాన్ని పరామర్శించే లోపే మరో కార్యకర్తను హత్య చేయడం, పరిటాల రవిని రోడ్డుపై హత్య చేయడం, వీరి అవినీతికి పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లడం వంటి పరిస్థితి ఉండేదని గుర్తు చేశారు. నాటి దుర్భర పరిస్థితిని పాదయాత్రలో చూసి చలించిపోయాయని, వాటి పరిష్కారాలనే టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి, అధికారంలోకి రాగానే అన్నింటినీ నెరవేర్చామన్నారు. ఆర్బీఐ కాదన్నా, పట్టుదలతో రైతులకు 24 వేల కోట్ల రూపాయల మేర రుణమాఫీ చేశామన్నారు. వివిధ సందర్భాల్లో డబ్బుల కోసం చూడకుండా, రైతు సంక్షేమమే చూశానని తెలిపారు. ఇప్పటికే 60 అన్న క్యాంటీన్లను ప్రారంభించామని, మరో 40 ప్రారంభించనున్నామని తెలిపారు. అన్న క్యాంటీన్ సొసైటీ ఏర్పాటు చేస్తామని, పెళ్లిరోజు, పుట్టినరోజులకు విరాళాలు ఇస్తే, వారి పేరుతో ఆ రోజు భోజనాలు పెడతామన్నారు. కేంద్రం చక్కెరపై రాయితీ ఎత్తివేసినా, తమ ప్రభుత్వం సరఫరా చేస్తోందన్నారు. నిరుపేద కుటుంబాలకు చంద్రన్న బీమా కొండంత అండగా ఉందన్నారు. పెళ్లికానుకలో సాంకేతిక సమస్యలను పరిష్కరిస్తున్నామని, త్వరలో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. పేదలకు 19 లక్షల ఇళ్లను ఇస్తున్నామని, త్వరలో మరో 5 లక్షలు మంజూరు చేశామన్నారు. మేనిఫెస్టోలో ఉన్న వాటిని అన్నింటినీ నెరవెర్చామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశానికి 100వ స్థానం వస్తే, ప్రచారంలో ఊదరగొడుతున్నారని, రాష్ట్రానికి నెంబర్ 1 స్థానం వస్తే, మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నేతలకు పిలుపునిచ్చారు. మన ఎంపీలు విభజన చట్టంలోని అంశాలను అమలు చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తున్నారన్నారు. కడప ఉక్కు కోసం చేసిన నిరహార దీక్ష చరిత్ర సృష్టించిందని, ప్రజల్లో నమ్మకం పెంచిందన్నారు. కడప ఉక్కు తమ హక్కు అని, చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని స్పష్టం చేశారు. విభజన హామీలు నెరవేర్చే దాకా ధర్మపోరాటాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు. దళిత తేజానికి వచ్చిన ఉత్సాహం తానెన్నడూ చూడలేదన్నారు. ఎస్టీ, ఎస్సీ చట్టానికి తూట్లు పొడవద్దని స్పందించిన పార్టీ టీడీపీ అని తెలిపారు. గతంలో టీడీపీపై అభిమానం ఉన్నప్పటికీ, బీజేపీ వల్ల ముస్లింలు దూరమయ్యారని, ఇప్పుడు తిరిగి చేరువ కావడం శుభ సూచకమన్నారు. ముస్లిం మైనారిటీ తేజం సభను కూడా విజయవంతం చేయాలన్నారు.
మనసు ఉంది కాబట్టే...
డబ్బు ఉన్నా, లేకున్నా, మనసు ఉంది కాబట్టే ఇస్తున్నానని, చేస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. వివిధ వైద్య సేవలను విస్తృతం చేశామని, తలసేమియా, కిడ్నీ రోగులకు పింఛను ఇస్తున్నామన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు, వీఆర్‌ఏలకు, హోంగార్డులకు వేతనాలు పెంచామని, ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ, బకాయిలు ఇచ్చామని గుర్తు చేశారు. చిరుద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకూ అద్భుతంగా పని చేయడం వల్లే ఈ ఫలితాలు సాధించామన్నారు. భవిష్యత్తులో విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన ఏకైక ప్రభుత్వం తమదేదని గుర్తు చేశారు. 1500 రోజుల పండుగ సందర్భంగా గ్రామదర్శిని, గ్రామ వికాసం, వార్డు వికాసం కార్యక్రమాల్లో కార్యకర్తలు, నాయకులు ప్రజల్లో ఉండాలన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, ఐక్యంగా పని చేసి పార్టీని గెలుపుబాటలో నడిపించాలన్నారు. ఈ వర్కుషాపులో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకటరావు, మంత్రులు లోకేష్, యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పొలిట్ బ్యూరో సభ్యులు తదితరులు పాల్గొన్నారు.