ఆంధ్రప్రదేశ్‌

ప్రజల ముంగిట ‘సమాచారం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 5: రాష్ట్రంలో అనుక్షణం ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు ముఖ్యమంత్రి పరిశీలనకు, ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ముఖ్యమంత్రి డ్యాష్ బోర్డు సమాచారం రూపొందించినట్లు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కార్యదర్శి పిఎస్ ప్రద్యుమ్న తెలిపారు. ‘యూనిక్ ఐడెంటిఫికేషన్ అధారిటీ ఆఫ్ ఇండియా’ (ఆధార్) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆధార్ ఎనేబుల్డ్ అప్లికేషన్స్’ రెండు రోజుల సదస్సు మంగళవారం ముగిసింది. ప్రద్యుమ్న మాట్లాడుతూ రాష్ట్రంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పౌరులకు అందించే సేవలను మరింత మెరుగ్గా, కచ్చితంగా నిర్ణీత సమయంలో అందించడంపై ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి పర్యవేక్షణకు డ్యాష్‌బోర్డు సమాచారం దోహదపడుతుందన్నారు. లబ్ధిదారునికి ఆ క్షణం వరకు వ్యక్తిగతంగా అందిన సేవల వివరాలు డ్యాష్‌బోర్డు సమాచారంలో ఎప్పటికప్పుడు నమోదు కావడం ఇందులో విశేషమని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 5వ తేదీ వరకు తాము ప్రసంగిస్తున్న సమయం వరకు లక్షా 20 వేల మంది లబ్ధిదారులు రేషన్ సరుకులు తీసుకున్నారని, 85 శాతం మంది సామాజిక భద్రతపై పెన్షన్లు తీసుకున్నారని ఇందుకు ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు. ఈ సమాచారాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క డ్యాష్ బోర్డులోకి వెళ్లి తెలుసుకోవచ్చన్నారు. దీనివల్ల ప్రజా పంపిణీ వ్యవస్థ, గ్రామీణ ఉపాధి హామీ వేతనాలు, స్కాలర్‌షిప్‌లు, సామాజిక భద్రత పెన్షన్లు వంటి సేవలు ప్రజలకు అందజేయడంలో ప్రభుత్వానికి అనవసర వ్యయం తగ్గుతుందన్నారు. ఏటా ఒక ప్రజా పంపిణీ వ్యవస్థలో సుమారు రూ.500 కోట్ల మేర ప్రభుత్వానికి ఆదా అవుతోందన్నారు. రాష్ట్రంలో ఈ వ్యవస్థను శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా రౌడీషీటర్లను అదుపు చేసేందుకు వినియోగిస్తామన్నారు. రాష్ట్రంలో 27,530 మంది రౌడీషీటర్లు ఉన్నారన్నారు. సాధారణంగా వీరంతా పోలీస్ స్టేషన్లలో సంతకం చేసి తమ హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా వీరందరి బయోమెట్రిక్ హాజరును వారి ఇంటి వద్దే తీసుకుంటామన్నారు. సమీపంలో ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే ఆ రోజు బయోమెట్రిక్ హాజరు ఇవ్వని రౌడీషీటర్లను తక్షణం విచారించే అవకాశం కలుగుతుందన్నారు. అదే విధంగా రౌడీషీటర్ల రోజువారీ కార్యకలాపాలపై పర్యవేక్షణ సులువవుతుందన్నారు. ప్రజారోగ్య వ్యవస్థను సైతం సాంకేతిక ఆధారంగా ఇ-ఔషధి విధానంలో ప్రత్యక్ష పర్యవేక్షణలోకి తేగలిగామని ఆయన వివరించారు. రాష్ట్రంలో ఈ విధానాన్ని అమలుపరచిన ఈ ఏడాది జనవరి 1 నుంచి వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెండు కోట్ల 12 లక్షల 29 వేల మంది ఔట్ పేషెంట్లు మందులు తీసుకున్నారన్నారు. ఈ ఒక్కరోజే వివిధ ఆసుపత్రుల్లో 80 వేల 232 మంది మందులు తీసుకున్నట్లు డ్యాష్ బోర్డు సమాచారాన్ని ఉటంకిస్తూ ఆయన వెల్లడించారు. ఏరోజు ఎంతమందికి వ్యాధి నిర్ధారణ పరిక్షలు చేసింది వాటి వివరాలు వంటివి డ్యాష్‌బోర్డు సమాచారంలో నిక్షిప్తం చేస్తామన్నారు. అదే విధంగా రాష్ట్రంలో రియల్ టైమ్ గ్రౌండ్ వాటర్ లెవల్‌ను ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డు ద్వారా ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలిస్తారన్నారు. ప్రతి ఉదయం ముఖ్యమంత్రి తొలి అధికారిక కార్యక్రమంగా తమ ట్యాబ్‌లో ఈ వివరాలను పరిశీలిస్తారన్నారు.