ఆంధ్రప్రదేశ్‌

వౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 5: రాష్ట్ర విభజన తర్వాత పారిశ్రామిక, వాణిజ్య రంగాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. పెద్దఎత్తున పారిశ్రామిక ప్రాజెక్టులను చేపట్టిన ప్రభుత్వం వౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించింది. ముఖ్యమంత్రి సహా ప్రభుత్వ ప్రతినిధులు జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పాల్గొంటున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపార దిగ్గజాలను కలిసి పలు ఒప్పందాలు చేసుకుంటున్నారన్నారు. సత్వర పారిశ్రామికాభివృద్ధి, ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు వౌలిక సదుపాయాలు పటిష్టపరుస్తోంది. ఆసక్తి చూపుతున్న కంపెనీలకు భూముల కేటాయింపు సత్వరం జరిగే విధంగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. త్వరితగతిన భూసేకరణ జరిపేందుకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా ఈ పనులు సత్వరం జరిగేందుకు ఎపిఐఐసి (ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) బోర్డులో జిల్లా కలెక్టర్లకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదా కూడా కల్పించింది. భూ సేకరణ, పరిశ్రమల స్థాపనకు అనువైన స్థలాల కేటాయింపు, వాటికి అనుకూల పరిస్థితులు, వౌలిక సదుపాయాల కల్పన వంటి బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. రాష్ట్రంలో నేషనల్ ఇనె్వస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ (ఎన్‌ఐఎంజెడ్), రెండు పారిశ్రామిక కారిడార్లు ఏర్పడనున్నాయి. ప్రకాశం జిల్లాలోని పామూరు వద్ద నేషనల్ ఇన్‌వెస్ట్‌మెంట్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ ఏర్పడనుంది. దీనికి కావలసిన అన్ని రకాల వౌలిక సదుపాయాలను కేంద్ర ప్రభుత్వమే కల్పిస్తుంది. అంతేకాకుండా పరిమిత కాలంలోనే విమానాశ్రయాలు, రైలు, రోడ్డు మార్గాలు, టెలికం వ్యవస్థ వంటి వాటిని ఈ జోన్‌కు అనుసంధానం చేస్తారు. వీటన్నిటికి కావలసిన నిధులను కూడా కేంద్ర ప్రభుత్వమే సమకూరుస్తుంది. చెన్నై - బెంగళూరు పారిశ్రామిక కారిడార్ (సిబిఐసి), విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్‌లు ఏర్పడనున్నాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డిఐపిపి), జపాన్ ఇంటర్నేషనల్ కార్పొరేషన్ ఏజన్సీ (జెఐసిఎ) కలిసి సిబిఐసికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక కూడా రూపొందించాయి. అంతేకాకుండా ఈ జోన్ పరిధిలో పారిశ్రామికంగా అభివృద్ధి పరచడానికి అనువైన మూడు ప్రాంతాలను కూడా గుర్తించాయి. అవి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం, చిత్తూరు జిల్లాలోని ఏర్పేడు, అనంతపురం జిల్లాలోని హిందూపురం. విశాఖ - చెన్నై పారిశ్రామిక కారిడార్ (విసిఐసి) తీర ప్రాంతంలో దేశంలో మొదటిది. తూర్పు ఆర్థిక కారిడార్‌గా కీలక పాత్ర పోషించే విధంగా దీనిని రూపొందించడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇది శ్రీకుళం జిల్లాలోని పైడిభీమవరం నుంచి తమిళనాడులోని చెన్నై వరకు విస్తరించి ఉంటుంది. దీని విస్తీర్ణం దాదాపు లక్షా పదివేల చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇది దేశ భూ భాగంలో 3.5 శాతం. ఈ కారిడార్‌లో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు, 50 వేల ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనికి ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఎడిబి) సహాయ సహకారాలు అందిస్తుంది