ఆంధ్రప్రదేశ్‌

కొండవెలగాడలో ప్రబలిన అతిసార

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 5: జిల్లాలోని నెల్లిమర్ల మండలం కొండవెలగాడలో అతిసార విజృంభిస్తోంది. అతిసారతో ఇద్దరు వ్యక్తులు మరణించగా, గ్రామస్తులు మాత్రం ముగ్గురు మరణించారంటున్నారు. కానీ వైద్యఆరోగ్య శాఖ అధికారులు మాత్రం వీరి మరణానికి కారణాలు వేరే అంటూ సమస్య నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కలుషిత నీరు తాగటమో, లేక అపరిశుభ్రమైన ఆహారం తినడం వల్లో గత నాలుగు రోజులుగా కొండవెలగాడలో అతిసార ప్రబలింది. సోమవారం సాయంత్రానికి బాధితుల సంఖ్య 20 కాగా, మంగళవారానికి 30కి దాటింది. గడచిన రెండురోజుల్లో మొయిద సన్యాసమ్మ, సీల నారాయణ డయేరియాతో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పావాడ సూరమ్మ అనే మహిళ కూడా డయేరియాతో మరణించినట్లు జిల్లాకేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డయేరియా బాధితులు చెప్పారు. మృతులంతా 60ఏళ్లకు పైబడినవారే. అకస్మాత్తుగా వాంతులు, విరేచనాలు కావడంతో వైద్యం అందేలోగా వీరు మృతిచెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. మంగళవారం కూడా డయేరియా బాధితుల సంఖ్య పెరగటంతో జిల్లా కేంద్రం నుంచి వైద్య,ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శారద ప్రత్యేక బృందంతోగ్రామంలో బాధితులకు వైద్యం ప్రారంభించారు. ఎనిమిదిమంది పరిస్థితి తీవ్రంగా ఉండటంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. మరో ఎనిమిదిమందికి కొండవెలగాడలోనే సెలైన్ ఎక్కించి వైద్యం చేస్తున్నారు. మిగతా వారి పరిస్థితి పరవాలేదని డాక్టర్లు తెలిపారు. నెల్లిమర్ల ఆరోగ్య కేంద్రంలో 13మంది డయేరియా బాధితులను వైద్యం కోసం చేర్చారు. కాగా కొండవెలగాడలో మరణించిన ముగ్గురు వ్యక్తులు డయేరియాతో మరణించలేదని జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శారద తెలిపారు. వయోభారం, ఇతర అనారోగ్య కారణాలతో మరణాలు సంభవించాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. గ్రామంలో డయేరియా నివారణకు విస్తృత చర్యలు చేపట్టామని చెప్పారు. గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శారద అన్నారు.