ఆంధ్రప్రదేశ్‌

‘సదావర్తి సత్రం’లో వాస్తవాలు ఇవీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 5: అమరావతి సదావర్తివారి సత్రం భూముల వేలం విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, అంతా పారదర్శకంగానే జరిగిందని దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు స్పష్టం చేశారు. మంగళవారం సిఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమిళనాడులో ఉన్న సదావర్తివారి సత్రం భూములు చాలాకాలం కిందటే ఆక్రమణలకు గురయ్యాయన్నారు. తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన సమాచారం మేరకు సుమారు 471.76 ఎకరాల భూమి సదావర్తివారి సత్రం కింద ఉండేది. అయితే తమిళనాడు దేవాదాయశాఖ చట్టాన్ని అనుసరించి ఇందులో 346.25 ఎకరాల భూమికి అక్కడి ప్రభుత్వం పట్టాలు జారీ చేసింది. మరో 36.55 ఎకరాల భూమి గవర్నమెంట్ పోరంబోకుగా ఉంది. 83.11 ఎకరాల భూమి మాత్రమే ఎవరి అధీనంలోని లేని భూమి మాత్రమేనని తమిళనాడు ప్రభుత్వం తేల్చి చెప్పిందని మాణిక్యాల రావు వివరించారు. ఈ భూములకు సంబంధించి 2008 నుంచి తమిళనాడు హైకోర్టులో కేసులు చూస్తున్న అడ్వకేట్ ఉదయకుమార్ 83.11 ఎకరాలను బహిరంగ వేలం వేయడం మంచిదని సూచించారని, ఈ మేరకు ఎపి ప్రభుత్వం చెన్నైలోని రాయపేట హైవేలోని హథీరాంజీ మఠం స్కూలు బిల్డింగ్‌లో ఈ ఏడాది మార్చి 28న బహిరంగ వేలం నిర్వహించినట్టు మంత్రి మాణిక్యాలరావు తెలియచేశారు. ఎకరా 50 లక్షల రిజర్వ్ ధరగా నిర్ణయించి, బహిరంగ వేలం నిర్వహించాలని నిర్ణయించారు. ఇంత మొత్తంతో పాట పాడేందుకు వచ్చిన ఎవరూ మొగ్గు చూపనందున, దీన్ని 26,20,000 రూపాయలకు తగ్గించారు. చివరకు సంజీవరెడ్డి అనే వ్యక్తి సహా ఎనిమిదిమంది ఎకరా 27,00,188 రూపాయల చొప్పున 83.11 ఎకరాల భూమిని 22,44,12,625 రూపాయలకు పాడుకున్నారని మంత్రి మాణిక్యాలరావుతెలిపారు. సదావర్తివారి సత్రం భూమిపై ధర్మకర్తలకు ఎటువంటి హక్కు లేదనీ, దీనిపై న్యాయ పోరాటం చేసిన మీదట కోర్టు సదరు సత్రం పేరిట డిక్రీ ఇచ్చిందని, దీని ఆధారంగా స్థలాన్ని విక్రయించినట్టు మాణిక్యాలరావు పేర్కొన్నారు. 900 కోట్ల విలువ చేసే భూమిని కారు చవకగా విక్రయించారని చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. 900 కోట్లలో ఒక్క శాతం మొత్తాన్ని ఇప్పుడు వచ్చన మొత్తానికి అదనంగా చెల్లించి, ఈ భూమిని స్వాధీనం చేసుకోవచ్చని మాణిక్యాలరావు సవాలు విసిరారు.