ఆంధ్రప్రదేశ్‌

గుంటూరు యార్డు చైర్మన్ పదవికి గ్రీన్‌సిగ్నల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూలై 5: ఆసియాలోకెల్లా అతిపెద్దదయిన గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవిపై నెలకొన్న పీటముడి వీడింది. యార్డు చైర్మన్ పదవిపై ఇప్పటి వరకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో రాజీఫార్ములా ప్రకారం పంపకాలు జరపాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ పంచాయితీ చివరకు ముఖ్యమంత్రి కోర్టుకు చేరింది. యార్డు చైర్మన్ పదవి భర్తీలో పేచీలు తలెత్తడంతో గుంటూరు జిల్లా నేతలను సిఎం చీవాట్లు పెట్టినట్లు తెలిసింది. సిఎం సొంతంగా నివేదిక తెప్పించుకుని చివరకు రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ సుబ్బారావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. యార్డు చైర్మన్‌తో పాటు 19 మంది డైరెక్టర్లను నియమించాల్సి ఉంది. గుంటూరు తూర్పు, పశ్చిమతో పాటు ప్రత్తిపాడు, పొన్నూరు, మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాలకు చెందిన వారిని డైరెక్టర్లుగా నియమించేందుకు జాబితా సిద్ధం చేయాల్సిందిగా సిఎం ఆదేశించారు. మంగళగిరి నియోజకవర్గానికి వైసీపీ ప్రాతినిధ్యం వహించడంతో నియోజకవర్గ ఇన్‌చార్జికి బాధ్యతలు అప్పగించారు. అయితే మన్నవ అభ్యర్థిత్వాన్ని ఆది నుంచి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి వర్గం వ్యతిరేకిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికీ డైరెక్టర్ల పదవులకు జాబితా సిద్ధం కాలేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సిఎం స్వతంత్ర నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 191 మార్కెట్ యార్డులకు గాను 144 మార్కెట్ కమిటీలను నియమించారు. మరో 31 యార్డులకు సంబంధించి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల నుంచి ప్రతిపాదనలు అందలేదు. మిగిలిన 13 యార్డుల పాలకవర్గాల విషయమై కోర్టులో వ్యాజ్యాలు నడుస్తున్నాయ.