ఆంధ్రప్రదేశ్‌

ఆరుగురు ఎస్పీల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), ఆగస్టు 9: రాష్ట్రంలో ఆరుగురు నాన్ క్యాడర్ ఎస్పీలను బదిలీ చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో నలుగురు అధికారులు గత కొద్దికాలంగా వెయిటింగ్‌లో కొనసాగుతుండగా ఎట్టకేలకు పోస్టింగ్ దక్కింది. మరో ఇద్దరిలో ఒకరు విజయవాడ ట్రాఫిక్ డీసీపీగా ప్రస్తుతం పని చేస్తున్నారు. తాజా ఉత్తర్వుల ప్రకారం.. వెయిటింగ్‌లో ఉన్న నాన్ క్యాడర్ ఎస్పీలు షేక్ ష్రీన్ బేగంను ఏసీబీలో నియమించారు. అదేవిధంగా కేవీ మురళీకృష్ణను ఇంటిలిజెన్స్‌కు, వై రవిశంకర్‌రెడ్డిని విజయవాడ సిటి డీసీపిగా నియమించారు. అదేవిధంగా జిఆర్ రాధికకు ఆక్టోపస్ విభాగంలో ఎస్పీగా పోస్టింగ్ కల్పించారు. ఇదిలావుండగా ఇంటిలిజెన్స్ ఎస్పీగా పని చేస్తున్న ఎం సుందర్‌రావును ఒంగోలు పోలీసు ట్రైనింగ్ సెంటర్‌కు బదిలీ చేశారు. విజయవాడ డీసీపీగా పని చేస్తున్న టి రాంప్రసాదరావును ఇంటిలిజెన్స్ విభాగంలో ఎస్పీగా బదిలీ చేశారు.