ఆంధ్రప్రదేశ్‌

బీజేపీ, వైకాపా లాలూచీ బట్టబయలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 9: రాజ్యసభ ఉపాధ్యక్షుని ఎన్నికల్లో వైకాపా, బీజేపీల మధ్య లాలూచీ రాజకీయాలు మరోసారి బయటపడ్డాయని రాష్ట్ర శాసనమండలి విప్ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీ అభ్యర్థి విజయానికి వైకాపా పరోక్షంగా సాయపడిందని మండిపడ్డారు. వెలగపూడి సచివాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ కొంతకాలంగా బీజేపీ, వైకాపాల సంబంధాలపై టీడీపీ చేస్తున్న విమర్శలు నిజమయ్యాయన్నారు. బీజేపీ అభ్యర్థిని ఓడిస్తామన్న వైకాపా నేతలు చివరి నిమిషంలో ఎన్నికల నుంచి తప్పుకున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కంటే వైకాపాకు స్వప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. ఏపీ సమస్యలు పార్లమెంట్‌లో చర్చించకుండా, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు రాకుండా పలాయనవాదం పఠిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాఫెల్ విమానాల కొనుగోలు వ్యవహారంపై సుప్రీంకోర్టు లేదా సీబీఐతో దర్యాప్తు కోసం ఎంపీ జీవీఎల్, కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు.