ఆంధ్రప్రదేశ్‌

సయ్యద్ నసీర్ అహమ్మద్‌కు మహారాష్ట్ర బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 9: మాతృభూమి విముక్తి పోరాటంలో అపూర్వ త్యాగాలు, అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించి ఆంగ్లేయులతో పోరాడిన ముస్లిం స్వాతంత్య్ర సమరయోధులను ప్రస్తుత తరానికి తన పరిశోధనాత్మక గ్రంథాలు, ఇతర కార్యక్రమాల ద్వారా పరిచయం చేస్తున్న గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన ప్రముఖ చరిత్రకారుడు, బహు గ్రంథ రచయిత సయ్యద్ నసీర్ అహమ్మద్ కృషికి గుర్తింపుగా జాతీయ స్థాయి ‘మహారాష్ట్ర బుక్ ఆఫ్ రికార్డ్స్‌ర్డ్’ పురస్కారం లభించింది. మహారాష్టక్రు చెందిన మహారాష్ట్ర బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రధాన సంపాదకులు డాక్టర్ సునీల్ దాదా పాటిల్ నుండి ఈ మేరకు నసీర్ అహమ్మద్‌కు గురువారం లేఖ అందింది.
మనం మరచిన మన స్వాతంత్య్ర సమరయోధులను ప్రజలకు పరిచయం చేసేందుకు నిరంతరం పరిశోధన, ప్రచురణ, ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమై గత రెండు దశాబ్దాలుగా అరుదైన పరిశోధనాత్మక చరిత్ర గ్రంథాలను ప్రజలకు అందిస్తున్నందున నసీర్ అహమ్మద్‌కు పురస్కారానికి ఎంపిక చేశామని పాటిల్ ఆ లేఖలో వెల్లడించారు. ఈ సందర్భంగా నసీర్ మాట్లాడుతూ మన 71వ స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల సందర్భంగా ‘మహారాష్ట్ర బుక్ అఫ్ రికార్డ్స్’ పురస్కారం లభించడం సంతోషం కల్గిస్తోందన్నారు. తన పుస్తక రచన, ప్రచురణ, ప్రచార కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.