ఆంధ్రప్రదేశ్‌

రైల్వే ప్రాజెక్టు పనులు వేగవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 9: రాష్ట్రానికి మంజూరైన వివిధ రైల్వే ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలని అధికారులను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సీఎస్) దినేష్‌కుమార్ ఆదేశించారు. రాష్ట్రానికి మంజూరైన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై వెలగపూడి సచివాలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్, ఇతర రైల్వే అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో గురువారం సీఎస్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల మేరకు మంజూరైన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. వివిధ రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన నిధులు, భూసేకరణ, తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి, రాయలచెరువు వద్ద ఆర్వోబీ, నడికుడి-శ్రీకాళహస్తి సెక్షన్ కొత్త రైల్వేలైన్ ప్రాజెక్టు భూసేకరణ, తదితర అంశాలపై పనుల పురోగతిని సీఎస్ అడిగి తెలుసుకున్నారు. రైల్వే ప్రాజెక్టులకు భూసేకరణ అంశంలో సమస్యలు ఏమైనా ఉంటే, వాటి పరిష్కారానికి సీసీఎల్‌ఏ, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇటువంటి సమస్యలు పరిష్కరించేందుకు వీలుగా రైల్వే తరపున నోడల్ అధికారిని నియమించాలని సూచించారు. రాయలచెరువు వద్ద నిర్మించనున్న రోడ్డు అండర్ బ్రిడ్జికి 18.88 కోట్ల రూపాయలు వ్యయం కానుందని, ఇందుకు రైల్వే 9 కోట్ల రూపాయలు భరిస్తున్నదని, మిగిలిన మొత్తాన్ని తుడా నుంచి సమకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. విభజన చట్టంలో పేర్కొన్న మేరకు రాష్ట్రానికి హైస్పీడ్ రైలు, ఇతర ప్రాజెక్టులను సకాలంలో మంజూరు చేసేలా రైల్వే అధికారులు చొరవ చూపాలన్నారు. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ వివిధ పనులకు సంబంధించి రైల్వే పరంగా చేయాల్సిన పనులు చాలా వరకూ పూర్తి చేశామన్నారు. కావలి-పెదపావని రహదారిపై 43 కోట్ల రూపాయలతో చేపట్టిన ఆర్వోబీ పూర్తి చేశామని తెలిపారు. విశాఖ జిల్లా యలమంచిలి వద్ద 35 కోట్ల రూపాయలతో, తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు వద్ద 28 కోట్ల రూపాయలతో, కాకినాడ నగరంలో 65 కోట్ల రూపాయలతో, గూడూరులో 63 కోట్ల రూపాయలతో, నంద్యాల వద్ద 39 కోట్ల రూపాయలతో చేపట్టిన ఆర్వోబీ పనులు పూర్తి చేశామని సీఎస్‌కు వివరించారు. విజయవాడ-గుడివాడ-్భమవరం డబుల్ లైను పనులు శరవేగంగా జరుగుతున్నాయని, గుంటూరు- గుంతకల్, నడికూడి-శ్రీకాళహస్తి, గుంటూరు-తెనాలి డబుల్ లైన్ పనులు కూడా పురోగతిలో ఉన్నాయన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్ అభివృద్ధికి, సౌకర్యాల మెరుగుకు తమ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. విజయవాడ రైల్వే స్టేషన్‌పై రైళ్ల రద్దీని తగ్గించేందుకు విజయవాడ-విశాఖ మార్గంలో నడిచే కొన్ని రైళ్లను రాయనపాడు నుంచి బైపాస్ చేసేందుకు గుర్తించామన్నారు.
ఇందుకు అనుగుణంగా రాయనపాడుకు బస్ సౌకర్యం కల్పించాలని కోరారు. రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ మాట్లాడుతూ 119 ఆర్వోబీలు, ఆర్‌యూబీలు మంజూరు కాగా, 58 పూర్తి అయ్యాయని తెలిపారు.

చిత్రం..రైల్వే ప్రాజెక్ట్‌ల పురోగతిపై సమీక్షిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్