ఆంధ్రప్రదేశ్‌

ముఖ్యమంత్రిది సాహసోపేతమైన చర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 9: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న రైతు రుణమాఫీ కార్యక్రమం సాహసోపేతమైన చర్య అని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. కేంద్రం సహకరించకున్నా రాష్ట్రంలో రైతులకు అండగా నిలిచామన్నారు. గురువారం ఇక్కడి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ‘రైతు ఉపశమన అర్హత పరిష్కార వేదిక’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టెడన్నం పెట్టే రైతులను ఎవరూ నిరుత్సాహ పరచవద్దన్నారు. కొంతమంది పారిశ్రామికవేత్తలు వేలాది కోట్ల రుణం పొంది పారిపోతున్నారని, అలాంటపుడు కేవలం రూ.లక్ష రుణం తీసుకున్న రైతులు ధైర్యంగా ఉండాలే తప్ప ఆత్మహత్యలకు పూనుకోరాదన్నారు. రైతులకు అండగా తాము ఉంటామని ఎవరికీ భయపడాల్సిన పనిలేదని ఆయన ఉద్ఘాటించారు. రుణమాఫీ అందని రైతులు ఉంటే వారు దరఖాస్తు చేసుకుంటే వారికి కూడా రుణమాఫీ వర్తింపజేస్తామన్నారు. దేశవ్యాప్తంగా ఎన్డీయే హయాంలో వీపీ సింగ్ ప్రభుత్వం రూ.10వేల కోట్లు రైతు రుణమాఫీ చేయగా, ఇపుడు మన రాష్ట్రంలోనే రైతులకు రూ.24,500 కోట్ల మేర రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా వ్యవసాయ పంటలకు మద్దతు ధర ప్రకటిస్తున్న కేంద్రం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 70 శాతం పంటలను కొనుగోలు చేస్తున్నప్పటికీ, మన రాష్ట్రంలో మాత్రం పంటలను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని విమర్శించారు. రైతులను ముంచేస్తున్నామని రోడ్లపై తిరుగుతున్న వారు అనడం ఎంత వరకు సమంజసమని ఆయన జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రైతులకు మూడో విడత కింద రూ.3800 కోట్లు మాఫీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే రూ.3600 కోట్ల మేర మాఫీ చేశామన్నారు. రైతులకు 10 శాతం వడ్డీతో ఆ మొత్తాన్ని చెల్లిస్తున్నామని వివరించారు. రాయలసీమలో నిమ్మ, వేరుశనగ పంటలు ఎండిపోతే ఆ పంటలను కాపాడేందుకు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేసి ఆ పంటలను కాపాడామని గుర్తు చేశారు.
రైతు ఉపశమన రుణ అర్హత పరిష్కార వేదికను గన్నవరంలో నిర్వహించినపుడు 7.5 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. వాటిలో ఆరు లక్షల మేరకు పరిష్కరించామన్నారు. ఇక జిల్లాల వారీగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే రైతులకు మంచి ప్రయోజనం ఉంటుందన్న ఆలోచనతో జిల్లాల వారీగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఇదిలా ఉండగా జిల్లాలో అత్యధిక వర్షపాతం ఉన్నప్పటికీ దిగుబడి తక్కువగా ఉందన్నారు. జొన్న, మొక్కజొన్న పంటలను ప్రోత్సహించేందుకు రూ.200 ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సుజయ్‌కృష్ణ రంగారావు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతు ఉపశమనం సత్ఫలితాలనిస్తుందన్నారు. కాగా, ప్రతిపక్షాలు తట్టుకోలేక విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అత్యధికంగా ఎన్టీఆర్ జలసిరిని ఇక్కడ వినియోగించుకుంటున్నారని చెప్పారు.
కార్యక్రమంలో వ్యవసాయశాఖ ప్రత్యేక కమిషనర్ మురళీధర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మీసాల గీత, కెఎ నాయుడు, పతివాడ నారాయణస్వామినాయుడు, కిమిడి మృణాళిని, ఎమ్మెల్సీ జగదీష్, జిల్లా కలెక్టర్ హరి జవహర్‌లాల్, జెడి లీలావతి తదితరులు పాల్గొన్నారు.