ఆంధ్రప్రదేశ్‌

అవయవదానాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖ (జగదాంబ), ఆగస్టు 9: విద్యార్థి దశ నుంచే రక్తదానం, అవయవదానంపై అవగాహన కల్పించి, ఎనిమిదో తరగతి నుంచి పాఠ్యాంశాల్లో చేర్చాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. విశాఖలోని ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో ఆల్ ఇండియా బాడీ, ఆర్గాన్ డోనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం ప్రపంచ అవయవదాన వారోత్సవాల ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 18 ఏళ్లు నిండినవారంతా రక్తదానం చేయవచ్చన్నారు. అవయవాలను దానం చేయడం ద్వారా మరో మనిషికి జీవితాన్ని అందించ వచ్చన్నారు. అవయవదాన ప్రక్రియ పురాణ కాలం నుంజీ ఉందని, దీనికి నిదర్శనమే వజ్రాయుధమన్నారు. సమాజంలో సమస్యలపై అవగాహన పెంచుకుని వాటిని పరిష్కరించడానికి రాజకీయాల్లోకి వస్తానని, దీనికి 13 జిల్లాలోని పర్యటనల అనంతరం ఓ నిర్ణయం తీసుకుంటామని లక్ష్మీనారాయణ అన్నారు. దీనిలో భాగంగానే నేడు విశాఖ జిల్లా పర్యటనకు వచ్చానని, వారం రోజుల పాటు ఏజెన్సీ, గిరిజన ప్రాంతాల్లో పర్యటిస్తానన్నారు. సమావేశంలో ఆల్ ఇండియా బాడీ, ఆర్గాన్ డోనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ గుడూరు సీతా మహాలక్ష్మీ, డాక్టర్ సూరపనేని విజయ్‌కుమార్ పాల్గొన్నారు.