ఆంధ్రప్రదేశ్‌

ఈయూకు భారీ మెజార్టీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 10: రాష్ట్ర విభజన తదుపరి ఏపీఎస్ ఆర్టీసీలో కార్మిక సంఘం గుర్తింపు కోసం రెండోదఫాగా ఎంతో హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో ఎంప్లారుూస్ యూనియన్ అనూహ్యరీతిలో 2వేల 399 ఓట్లు తిరుగులేని ఆధిక్యతతో గుర్తింపు సాధించుకుంది. ఆర్టీసీ చరిత్రలో ఇప్పటివరకు 15సార్లు ఎన్నికలు జరుగ్గా పదిసార్లు ఎన్‌ఎంయూ, ఐదుసార్లు ఈయూ గుర్తింపు పొందినట్లయింది. 2016 ఫిబ్రవరి 18న జరిగిన గత ఎన్నికల్లో కార్మిక సంఘాలన్ని విడివిడిగా పోటీ చేయగా ఎన్‌ఎంయూ 709 ఓట్ల ఆధిక్యతతో గుర్తింపు సాధించింది. ఈ సారి ఎంప్లాయిస్ యూనియన్, స్ట్ఫా ఎంప్లారుూస్ ఫెడరేషన్, కార్మిక పరిషత్, వైఎస్‌ఆర్ సంఘం కల్సి పోరాడాయి. రాష్టస్థ్రాయి గుర్తింపు ‘క్లాజ్-3’లో ఈయూకు 25వేల 771 ఓట్లు, ఎన్‌ఎంయూకు 23372 ఓట్లు, బహుజన వర్కర్స్ యూనియన్‌కు 208 ఓట్లు, కార్మిక సంఘ్‌కు 34 ఓట్లు, వర్కర్స్ యూనియన్‌కు 45 ఓట్లు లభించాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13,14 తేదీల్లో 774 మంది తమ పోస్టల్ బ్యాలెట్లను వినియోగించుకోనున్నారు.
14వ తేదీ సాయంత్రం ఓట్ల లెక్కింపు జరుగుతుంది. నాన్‌ఆపరేషన్ సెంటర్‌ల విషయానికి వస్తే విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో ఈయూ కూటమిలోని కార్మిక పరిషత్‌కు 119 ఓట్లు, ఎన్‌ఎంయూకు 118 ఓట్లు వచ్చాయి. గుర్తింపు వచ్చే అవకాశం కార్మిక పరిషత్‌కే ఉంది. ఇక్కడ నాలుగు పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. కడప నాన్‌ఆపరేషన్ జోన్‌లోనూ, విజయనగరం జోన్‌లోనూ ఈయూకు పూర్తిస్థాయిలో గుర్తింపు లభించింది. నెల్లూరు జోన్‌లో ఈయూకు పూర్తిస్థాయిలో గుర్తింపు లభించింది. నెల్లూరు జోన్‌లో ఈయూ కూటమిలోని స్ట్ఫా వర్కర్స్ ఫెడరేషన్ పూర్తి ఆధిక్యతతో గుర్తింపు సాధించింది. విజయవాడ నాన్‌ఆపరేషన్‌లో 265 ఓట్లకుగాను ఎన్‌ఎంయూకు 122 ఓట్లు రాగా ఈయూ కూటమి బలపర్చిన వైఎస్‌ఆర్ పోటీ చేయలేదు.
ఇక జిల్లాల వారీగా చిత్తూరు, కృష్ణా, తూర్పుగోదావరి, నెక్ రీజియన్‌లలో ఈయూ, నెల్లూరు జిల్లాలో ఫెడరేషన్ గుర్తింపు సాధించగా, కర్నూలు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలో ఎన్‌ఎంయూ గుర్తింపు సాధించింది. కడపలో క్లాజ్-6 పోటీ నుంచి వైఎస్‌ఆర్ ఆఖరిక్షణంలో వైదొలగింది. ఇక్కడ ఎన్‌ఎంయుకు 1571 ఓట్లు వచ్చాయి. అయితే గుర్తింపునకు 1634 ఓట్లు రావాల్సి ఉంది. ఇక పోస్టల్ బ్యాలెట్లు ఉన్నవి కేవలం 59 మాత్రమే. అనంతపురం జిల్లాలో ఈయూకు 1869 ఓట్లు, ఎన్‌ఎంయూకు 1808 ఓట్లు వచ్చాయి. గుర్తింపు కోసం 1882 ఓట్లు రావాల్సి ఉంటే 66 పోస్టల్ బ్యాలెట్లు ఉన్నాయి. ఇక్కడ ఈయూ గుర్తింపు పోస్టల్ బ్యాలెట్‌లపై ఆధారపడి ఉంది. మొత్తంపై గుర్తింపు 8 చోట్ల ఈయూ కూటమికి, మూడుచోట్ల ఎన్‌ఎంయూకు గుర్తింపు లభించింది.