ఆంధ్రప్రదేశ్‌

ఆరుగురు ఐఎఫ్‌ఎస్ అధికారుల బదిలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 10: రాష్ట్రంలో ఆరుగురు ఐఎఫ్‌ఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీశైలం ప్రాజెక్టు టైగర్ సర్కిల్ సీసీఎఫ్ ఎస్.శ్రీశరవణన్‌ను తిరుపతి డబ్ల్యుఎల్‌ఎం సర్కిల్‌కు బదిలీ చేసింది. అమరావతి జూ డైరెక్టర్ బి.ఎన్.ఎన్ మూర్తిని రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఈడీగా, పీసీసీఎఫ్ ఎకె వౌర్యను ఏపీపీఎస్సీ సెక్రటరీగా, పీసీసీఎఫ్ వి.బి.రమణ మూర్తిని స్టేట్ బ్యాంబ్ మిషన్ డైరెక్టర్‌గా, నెల్లూరు డీఎఫ్‌ఓ పి.రామ్‌మోహన్ రావును ఏపీఎఫ్‌డిసీ రాజమహేంద్రవరం రీజినల్ మేనేజర్‌గా, ఎపీఎఫ్‌డీసీ విశాఖ రీజినల్ మేనేజర్ శాంతి ప్రియను రాజమహేంద్రవరం సీసీఎఫ్‌గా నియమించింది. తిరుపతి అదనపు పీసీసీఎఫ్ బి.కె.సింగ్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు.
ముగ్గురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్‌కు బదిలీ
రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న వై.్భనుప్రకాష్‌ను యవజన సర్వీసుల డైరెక్టర్‌గా, విజయవాడ దుర్గామలేశ్వర దేవస్థానం ఈవో ఎం.పద్మను ఎపీ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఎండీగా, పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న మరో అధికారిణి వి.కోటేశ్వరమ్మను దుర్గామలేశ్వర స్వామి దేవస్థానం ఈవోగా నియమించింది. ఏపీ బేవరేజస్ కార్పొరేషన్ ఎండీ (పూర్తి అదనపు బాధ్యతలు) కె.వెంకటేశ్వరరావును రాష్ట్ర డీజీపీ (హెచ్‌ఓపీఎఫ్) కార్యాలయానికి రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది.