ఆంధ్రప్రదేశ్‌

నెలాఖరున వామపక్షాల బస్సు యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 11: ఈ నెల 13న నూతన రాజకీయ ప్రత్యామ్నాయ దిశగా కలిసి వచ్చే పార్టీలతో వామపక్షాలు జనసేన, లోక్‌సత్తా, ఇతర ప్రజాతంత్ర భావజాల పార్టీలతో భేఠీ కానున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ చెప్పారు. రాజమహేంద్రవరంలో రెండు రోజుల పాటు జరగనున్న సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభసభలో రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర సమితి సమావేశాల్లో ప్రజా అజెండాపై చర్చిస్తామన్నారు. రాష్ట్రంలో నూతన రాజకీయ ప్రత్యామ్నాయం దిశగా వామపక్షాలతో నూతన ప్రత్యామ్నాయ ఆలోచనతో కలిసి వచ్చే జనసేన, లోక్‌సత్తా, ఇతర పార్టీలతో ఈ నెల 13న ఉభయ వామపక్షాలు బేటీ కానున్నాయని వివరించారు. నూతన రాజకీయ ప్రత్యామ్నాయం దిశగా ఏప్రిల్ 20 ఉభయ రాజకీయ పార్టీలు సదస్సును విజయవాడలో నిర్వహించామని, ఈ సదస్సుకు సీపీఐ నుంచి జాతీయ కార్యదర్శి డి రాజా, సీపీఎం నుంచి పీవీ రాఘవులు హాజరయ్యారని, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై చర్చించి పలు తీర్మానాలు చేశామని, అనంతరం వివిధ రంగాలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఆయా ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా కార్మికుల సమస్యలపై విశాఖలో, దళిత సమస్యలపై రాజమహేంద్రవరంలో, గిరిజన సమస్యలపై విశాఖలో, రైతుల సమస్యలపై గుంటూరులో, వ్యవసాయ కార్మికులకు సంబంధించి నెల్లూరులో, యువజనులకు సంబంధించి తిరుపతిలోనూ రాష్ట్ర స్థాయి సదస్సులు నిర్వహించామన్నారు. వెనుకబడిన ప్రాంతాల సమస్యలపై చర్చించేందుకు అనంతపురం, కర్నూలు, ప్రకాశంలో సదస్సులు పూర్తయ్యాయని, ఉత్తరాంధ్రకు సంబంధించి విజయనగరంలో సదస్సులు నిర్వహించామన్నారు. 18న అనంతపురంలో సదస్సు నిర్వహించనున్నామని, మైనార్టీలకు సంబంధించి కర్నూలులో సదస్సు నిర్వహించనున్నామన్నారు. ఆగస్టు నెలాఖరున రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ, 175 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో రెండు దళాలుగా ఉభయ వామపక్షాలు బస్సు యాత్రలు చేపట్టనున్నామన్నారు. ఇచ్చాపురం నుంచి ఒక దళం బస్సు యాత్ర, హిందూపురం నుంచి మరో దళం బస్సు యాత్ర మొదలు కానుందన్నారు. సెప్టెంబర్ 15న విజయవాడలో భారీ ర్యాలీ నిర్వహించనున్నామన్నారు. ప్రజా అజెండాను ఆవిష్కరిస్తామన్నారు.