ఆంధ్రప్రదేశ్‌

235వ రోజు కొనసాగిన జగన్ యాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తుని, ఆగస్టు12: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, విపక్ష నేత వై ఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర 235వ రోజైన ఆదివారం తుని మండలంలో కొనసాగింది. రేఖవాని పాలెం నుండి ప్రారంభమైన పాదయాత్ర డి పోలవరం వరకు సాగింది. దారి పొడవునా ప్రజలు జగన్‌కు వినతిపత్రాలు అందించారు. పలువురు జగన్‌ను కలసి తమ గోడును జగన్‌కు విన్నవించుకున్నారు. పాయకరావుపేట, తుని ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్సు తమ సమస్యలపై జగన్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. అదేవిధంగా సీపీఎస్ రద్దుచేయాలని పలువురు విన్నవించుకున్నారు. తాము అధికారంలోకి వచ్చాక అందరి సమస్యలు తీరుస్తామని జగన్ వారికి హామీయిచ్చారు. మహిళలు, పిల్లలు, వృద్ధులను జగన్ అప్యాయంగా అక్కున చేర్చుకొని అభివాదం చేస్తూ పాద యాత్ర సాగించారు. ఆయన వెంట తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, వైసీపీ నేతలు కురసాల కన్నబాబు, పినిపే విశ్వరూప్, పర్వత పూర్ణచంద్రప్రసాద్, అనంత ఉదయభాస్కర్, మోతుకూరి వెంకటేష్, అనిశెట్టి సూర్యచక్రరెడ్డి, పోతల రమణ, తోట జగదీష్ తదితరులు యాత్రలో పాల్గొన్నారు.

చిత్రం..అభివాదం చేస్తూ పాదయాత్ర సాగిస్తున్న జగన్