ఆంధ్రప్రదేశ్‌

అక్టోబర్ 1 నుండి రాగులు, జొన్నల సరఫరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 12: ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ద్వారా పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో అక్టోబర్ 1 నుండి రేషన్ దుకాణాల ద్వారా తక్కువ ధరకే రాగులు, జొన్నలు సరఫరా చేయనున్నామని, కేంద్ర ప్రభుత్వం సహకారంతో పామాయిల్‌ను కూడా సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. నగరంలోని కృష్ణలంక నెహ్రూనగర్‌లోని చౌకధరల దుకాణం (నెం.300)లో ఆదివారం ఉదయం ఆయన ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ 300వ నెంబర్ రేషన్ దుకాణం ద్వారా నిత్యావసర వస్తువుల పంపిణీలో ప్రజాసంతృప్తి స్థాయి 37మాత్రమే ఉండడంతో విచారించేందుకు ఆకస్మిక తనిఖీ చేశామని చెప్పారు. డీలర్ ఇటీవల అనారోగ్యానికి గురికావడంతో ప్రజాపంపిణీలో జాప్యం జరిగిందని, అయితే సమయపాలన, సరుకుల పంపిణీ, ధరలు, తూకం వంటి అంశాల్లో కార్డుదారులను విచారించగా పూర్తిగా సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఇలాంటి సామాజిక తనిఖీలు నిర్వహించడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని, ప్రజాపంపిణీ రంగంలో సంబంధం వున్న ప్రతిఒక్కరిలో జవాబుదారీతనం పెరుగుతుందని మంత్రి అన్నారు. కార్డుదారులకు సకాలంలో సరుకులను సక్రమంగా పంపిణీ చేయాలని, ఈవిషయంలో అలసత్వం వహించినా, అవకతవకలకు పాల్పడినా డీలర్‌షిప్‌లను రద్దుచేసేందుకు కూడా వెనుకాడబోమని మంత్రి పుల్లారావు హెచ్చరించారు. తనిఖీల్లో పౌర సరఫరాల శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ఏ సూర్యకుమారి, జిల్లా సరఫరాల అధికారి నాగేశ్వరరావు, సహాయ సరఫరాల అధికారి-2 అడపా ఉదయ్‌భాస్కర్, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం..ఓ చౌకదుకాణంలో తనిఖీలు నిర్వహిస్తున్న మంత్రి పుల్లారావు