ఆంధ్రప్రదేశ్‌

మావోల ప్రభావిత ప్రాంతంలో సీఎం పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, ఆగస్టు 12: ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా పర్యటన ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతానికి సమీపంలో జరగనుండటంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ నెల 14వతేదీన జిల్లాలోని సాలూరు మండలం గదబ బొడ్డవలస గ్రామంలో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రానున్న విషయం విధితమే. ఆ రోజున ఉదయం హెలీకాఫ్టర్‌లో సాలూరు డిగ్రీ కళాశాలకు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి ఉదయం 11 గంటలకు గదబ బొడ్డవలసకు చేరుకుంటారు. ఈ ప్రాంతం ఆంధ్రా-ఒడిశా సరిహద్దుకు కేవలం 8 కిమీ దూరంలో ఉంది. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో అడుగడుగునా తనిఖీలు జరుపుతున్నారు. ఒడిశా ప్రాంతంలో మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండటంతో పూర్తి స్థాయిలో భద్రత బలగాలను రంగంలోకి దించారు. అన్నిచోట్ల ముమ్మరంగా తనిఖీలు జరపడంతోపాటు ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మరోపక్క వాతావరణం కూడా అనుకూలంగా లేకపోవడంతో ముఖ్యమంత్రి హెలీకాఫ్టర్‌లో వచ్చినా, రోడ్డు మార్గంలో వచ్చిన అందుకు అనుగుణంగా అవసరమైన భద్రత ఏర్పాట్లను చేశామని జిల్లా ఎస్పీ పాలరాజు స్పష్టం చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో పర్యటిస్తుండడం జిల్లాలో ఇదే ప్రధమం. దీంతో జర్నలిస్టులను కూడా ఆ ప్రాంతానికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఇప్పటికే సెక్యూరిటీ సిబ్బంది జిల్లాలోని అన్ని రహదారులలో ముమ్మరంగా తనిఖీలు జరుపుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన జిల్లా అధికారులకు ముచ్చెమటలు పట్టిస్తోంది.