ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రాన్ని దోచుకుంటున్న తండ్రీకొడుకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఆగస్టు 12: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పెద్ద అవినీతిపరుడని, రాష్ట్రాన్ని చంద్రబాబు, లోకేష్ దోచుకుంటున్నారని సినీనటి, చిత్తూరు జిల్లా నగరి శాసనసభ్యురాలు ఆర్‌కె రోజా ధ్వజమెత్తారు. ఆదివారం ఒంగోలులోని వైకాపా జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులు, రాజధాని భూముల విషయంలో కేంద్రం ఇచ్చిన నిధులకు సరైన లెక్కలు చెప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి అవినీతిపరుడంటూ ముఖ్యమంత్రితోపాటు తెలుగుదేశం పార్టీ మంత్రులు, నాయకులు విమర్శించటం వారికి ఆనవాయితీగా మారిందని ఆమె విమర్శించారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణాంతరం జగన్ ఒక రాజకీయ శక్తిగా మారి రాష్ట్రంలో తిరుగులేని నాయకుడిగా ఎదిగారని, ప్రజల నుండి జగన్‌కు వస్తున్న ఆదరణ చూడలేక ఆయన కుటుంబాన్ని కూడా బయటకు లాగే ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీ చేస్తోందని విమర్శించారు. గత ఏడు సంవత్సరాలుగా ఈడీ కేసుల్లో జగన్ సతీమణి భారతికి ఎలాంటి సంబంధం లేకపోయినప్పటికీ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా ద్వారా భారతిని బయటకులాగే ప్రయత్నం చేస్తున్నారని ఇది సిగ్గుచేటన్నారు. ఈడీలో చంద్రబాబుకు అనుకూలమైనవారే లేనిపోని లీకులు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. జగన్ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కొలేక ఆయన్ను మానసికంగా దెబ్బతీసేందుకు భారతిపై లేనిపోని ఆరోపణలతో ఒక పత్రిక ద్వారా వార్త రాయించారని విమర్శించారు.
ఈ విషయాన్ని మంత్రులు అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు వక్రీకరించి మాట్లాడటం బాధాకరమన్నారు. సీతమ్మ తల్లిలాంటి భారతమ్మ గురించి వక్రీకరించి మాట్లాడితే నారావారి నరకాసురులకు ప్రజలు భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతారని ఆమె హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారని, ఈ కేసు నుండి బయటపడేందుకు కేసీఆర్ ద్వారా ప్రధాని మోదీ వద్ద మోకరిల్లి ఆ కేసు నుండి చంద్రబాబు బయటపడేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించారు. అందులో భాగంగానే అప్పట్లో ఎన్‌డిఏతో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని తెలిపారు. ప్రస్తుతం ప్రత్యేక హోదా పేరుతో బయటకు వచ్చినప్పటికీ లోపాయకారిగా బీజేపీతో సంబంధాలు సాగిస్తూనే ఉన్నారని విమర్శించారు. ఇక మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖపట్నంలో భూములు కబ్జా చేశారని, అదేవిధంగా రాజధానిలో కూడా తెలుగుదేశం పార్టీ వారు లక్షల ఎకరాల భూములను స్వాహా చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి అవినీతిపరుడని, మంత్రి లోకేష్ పప్పు అని విమర్శించారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందుల పులి అని, భవిష్యత్తులో ఆ పులి దాడిని చంద్రబాబు తట్టుకోవటం చాలా కష్టమని ఆమె పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రోజా జోస్యం చెప్పారు.