రాష్ట్రీయం

బీపీ, ఎల్వీ ప్రాసిక్యూషన్‌కు సిబిఐకి అనుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 7: ఎమ్మార్ కేసులో ఇద్దరు ఐఎఎస్ అధికారులను ప్రశ్నించేందుకు సిబిఐకి అనుమతి లభించింది. ఐఎఎస్ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, బిపి ఆచార్యలను ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సిబిఐ చేసిన విజ్ఞప్తిని కేంద్రం సమ్మతించింది. దుబాయిక్ చెందిన ఎమ్మార్‌ప్రాపర్టీస్ మల్టీనేషనల్ కంపెనీతో కుదిరిన ఒప్పందంలో ప్రభుత్వ వాటా తగ్గించడానికి బిపి ఆచార్య బాధ్యుడని సిబిఐ వాదిస్తోంది. ఎమ్మార్ ప్రాపర్టీస్ లావాదేవీల ద్వారా అక్కడ భూములు పొందిన వారి జాబితా చాలా పెద్దది. అందులో రాజకీయ నేతలు, సినిమా తారలు, సెలబ్రిటీలు ఉన్నారు. ఇప్పటికే ఎమ్మార్ ప్రాపర్టీస్ మాజీ సిఇఓ విజయరాఘవన్‌ను సిబిఐ అరెస్టు చేసింది. అలాగే సునీల్‌రెడ్డిని కూడా సిబిఐ అరెస్టు చేసింది. 11 మందిని ఇప్పటికే ఈ కేసులో చేర్చింది. అందులో సునీల్‌రెడ్డి, బిపి ఆచార్య, కోనేరు ప్రసాద్‌లు కోర్టుకు హాజరుకాగా, మిగిలిన నిందితులను విచారించే దశలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో కేసు మరో మలుపు తిరుగుతుందని భావిస్తున్నారు.