రాష్ట్రీయం

క్యాన్సర్ నివారణలో భారత్‌ను అగ్రస్థానంలో నిలపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 24: క్యాన్సర్ వ్యాధిని అరికట్టడంలో భారత దేశాన్ని అగ్రస్థానంలో నిలపాలని భారత ఉపరాష్టప్రతి వెంకయ్యనాయుడు అన్నారు. బాబా అటామిక్ పరిశోధనా కేంద్రం, హోలీ బాబా క్యాన్సర్ ఆసుపత్రి సంయుక్తంగా శాస్తవ్రేత్తలతో శుక్రవారం ఇక్కడ నిర్వహించిన సమావేశంలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ భారత వైద్య పరిశోధనా సంస్థ ప్రతిరోజు సుమారు 12 నుంచి 13 లక్షల మంది క్యాన్సర్ రోగులను గుర్తిస్తోందని అన్నారు. పట్టణ, గ్రామీణ భారత దేశంలోని ప్రజల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని సకాలంలో చికిత్స అందించాలని ఆయన సూచించారు. పొగాకు వినియోగం వలన చాలామంది క్యాన్సర్ బారిన పడుతున్నారని అన్నారు. క్యాన్సర్ నివారణకు స్పష్టమైన చర్యలు చేపట్టవలసిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు అన్నారు. ఆధునిక జీవనశైలిలో మార్పులు రావాలని ఆయన చెప్పారు. శాస్త్ర, సాంకేతిక, అణుశక్తి రంగాల్లో భారతదేశం పురోభివృద్ధి సాధించాలని అన్నారు. దేశం గర్వించే విధంగా హోలీ జహంగీర్ బాబా గొప్ప అణుపరిశోధనలు చేశారని అన్నారు. భారత్‌లో 22 అణు రియాక్టర్లు, 6,780 మెగా వాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని అన్నారు. పరిశోధనా ఫలాలు సామాన్యులు, రైతులకు చేరాలని వెంకయ్యనాయుడు ఆకాంక్షించారు. దేశంలోని 58 విశ్వవిద్యాలయాలను తను సందర్శించానని, 29 స్నాతకోత్సవాల్లో పాల్గొన్నానని ఆయన చెప్పారు. రైతులతో పరస్పరం చర్చించి, వారు ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు తరోణోపాయాలను కనుగొనాలని శాస్తవ్రేత్తలకు సూచించారు. భారతదేశ సంస్కృతి, ఆచార సంప్రదాయాలను పరిరక్షించాలని చెప్పారు. సామాజిక సమస్యలపై అవగాహన ఉండాలని సూచించారు.