రాష్ట్రీయం

తెలుగు సంస్కృతి విశ్వజనీనం కావాలి: బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: తెలుగు భాషకు ప్రపంచ గుర్తింపు తీసుకువచ్చేందుకు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థను ఏర్పాటుచేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. తెలుగు భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యల గురించి శాసనసభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, కార్యదర్శి ఎంకె మీనా, డైరెక్టర్ విజయభాస్కర్‌తో సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడేలా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. లలిత కళలు, సాహిత్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. సాంస్కృతిక వ్యవహారాలశాఖ భాషను, సంస్కృతిని ప్రచారం చేయటంలో ముఖ్య భూమిక వహించాలన్నారు. సంస్కృతిని ప్రజల్లోకి తాత్వికంగా తీసుకు వెళ్లాలని సూచించారు. గ్రామదర్శిని కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని నిర్దేశించారు. సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో సంతోషం, సంతృప్తి స్థాయిని పెంచాలన్నారు. ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. గతంలో గ్రామాల్లో రాత్రిళ్లు కోలాటం, చెక్క్భజన, హరికథ వంటి కార్యక్రమాల్లో గ్రామస్తులు పాల్గొని అలసట నుండి ఉపశమనం పొందే వారన్నారు. గ్రామాల్లో జాతరలు, పొంగళ్లు కార్యక్రమాల్లో ప్రజలు ఎంతో ఉత్సాహంగా పాల్గొనేవారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమాలు గ్రామస్తుల్లో సంతృప్తి స్థాయిని పెంపొందించేవని చెప్పారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న హ్యాపీ సండేస్ ద్వారా ప్రజల్లో సంతోష స్థాయిని పెంచుతున్నామని తెలిపారు. సంస్కృతిని విస్మరిస్తే సమాజంలో సమస్యలు వస్తాయన్నారు. యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతికశాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా మాట్లాడుతూ కమిటీ నివేదిక, ముఖ్యమంత్రి సూచనల ప్రకారం తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేశామన్నారు.
అనంతరం తెలుగు భాషాభివృద్ధి ప్రాధికార సంస్థ పూర్తి స్థాయిలో పనిచేస్తుందని ముఖ్యమంత్రికి వివరించారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సూచనల ప్రకారం ఇప్పటికే తెలుగు నాటక అకాడమీ ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన అకాడమీలు త్వరలో ఏర్పాటవుతాయని చెప్పారు. సమావేశంలో సాంస్కృతికశాఖ డైరెక్టర్ విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..తెలుగు భాషాభివృద్ధిపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు