ఆంధ్రప్రదేశ్‌

విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ‘ఏపీ కాస్మిక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 5: రాష్ట్రంలో ఎటువంటి విపత్కర పరిస్థితులైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఏపీ కాస్మిక్ (ఏపీ క్రిటికల్ ఆపరేషన్ స్ట్రాటజిక్ మేనేజ్‌మెంట్ ఇన్సిడెంట్ కమాండ్) వ్యవస్థ అందుబాటులోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ ఎం.వి శేషగిరి బాబు వెల్లడించారు. వివిధ వ్యవస్థలను ఏపీ కాస్మిక్ గొడుగు కిందకు తీసుకువచ్చి, అక్టోబర్ 1 నుంచి కార్యరూపంలోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విజయవాడ సమీపంలోని కుంచనపల్లిలో ఆ శాఖ కార్యాలయంలో అంతర్జాతీయ సునామీ మాక్ డ్రిల్ కార్యాక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కోస్తాలోని 9 జిల్లాల పరిధిలోని 9 గ్రామాలను ఎంపిక చేసి మాక్ డ్రిల్‌ను నిర్వహించారు. ఇన్కోయిస్ సునామీ కల్పిత ప్రమాద హెచ్చరికలను జారీ చేసి, రాష్ట్ర స్థాయి అత్యవసర ఆపరేషన్ కేంద్రం నుంచి జిల్లా, గ్రామ స్థాయి యంత్రాగాన్ని అప్రమత్తం చేశారు. మాక్ డ్రిల్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సునామీ వంటి అత్యంత తీవ్ర ఉపద్రవాల హెచ్చరికలను అతి తక్కువ సమయంలో జారీ చేస్తామని, అతి తక్కువ సమయంలో స్పందించేందుకు క్షేత్ర స్థాయిలో అధికారుల, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం కీలకమని తెలిపారు.
ప్రకృతి విపత్తులు, అనుకోని సంఘటనలు సహా వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సభలు, సమావేశాల వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఏపీ కాస్మిక్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. వివిధ వ్యవస్థలను ఓకే గొడుగు కిందకు తీసుకువస్తామన్నారు. ఏక కాలంలో అధికారులను, స్వచ్ఛంద సంస్థలను సంసిద్ధులను చేసేందుకు దేశంలోనే తొలిసారిగా ఏపీ కాస్మిక్ వ్యవస్థను రూపొందించామన్నారు. 24 శాఖలు, 664 మండల అత్యవసర ఆపరేషన్ కేంద్రాలతో రాష్ట్ర స్థాయి అత్యవసర ఆపరేషన్ కేంద్రాన్ని సమన్వయం చేసుకోవడం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అత్యవసర పరిస్థితులను తట్టుకునేందుకు వీలుగా 13 శాటిలైట్ ఫోన్లను జిల్లా కలెక్టర్లు, ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాల వద్ద ఉంచుతామన్నారు. ఇప్పటికే శాటిలైట్ బేస్డ్ డేటా టెర్మినల్ పరికరాలను 20 కొనుగోలు చేశామన్నారు. తీరప్రాంతంలోని జిల్లాల్లో 18, రాష్టస్థ్రాయి విపత్తుల నిర్వహణ శాఖ వద్ద రెండు పరికరాలను అందుబాటులో ఉంచుతున్నామన్నారు. సమాచార వ్యవస్థ పని చేయనప్పుడు, శాటిలైట్ ఫోన్, డేటా టెర్మినల్ ద్వారా సమాచారాన్ని తెలుసుకుని అప్రమత్తం చేస్తామని తెలిపారు. సునామీ హెచ్చరికలు వస్తే, ఏ విధంగా స్పందించాలి, ప్రజల తరలింపు, తదితర అంశాలను మాక్‌డ్రిల్ ద్వారా అధికారులకు అవగాహన కల్పిస్తామన్నారు.
ఈ మాక్ డ్రిల్‌లో జిల్లాలోని వివిధ శాఖలు, రక్షణ రంగ అధికారులు, ఎన్‌డిఆర్‌ఎఫ్, అగ్నిమాపక, పోలీస్, రెవెన్యూ, తదితర శాఖలు పాల్గొన్నాయని తెలిపారు. విపత్తుల సమయంలో భారీ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకునేందుకు ఈ తరహా డ్రిల్స్ ఉపకరిస్తాయన్నారు. ఎపీ కాస్మిక్ ద్వారా ఎప్పటికప్పుడు హెచ్చరికలను అధికారులకు చేరేవేసేందుకు వీలుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడిస్తున్నామన్నారు.
సాధారణ సమావేశాల నుంచి జాతీయ విపత్తుల వరకూ ప్రతి అంశాన్ని శాటిలైట్ ద్వారా అధ్యయనం చేస్తూ, ప్రజలను అప్రమత్తం చేస్తామని వెల్లడించారు.
చిత్రం..ఏపీ కాస్మిక్ వ్యవస్థ గురించి వివరిస్తున్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ శేషగిరిబాబు