ఆంధ్రప్రదేశ్‌

బాక్సైట్‌పై ఆ రెండు పార్టీలూ ఒక్కటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, సెప్టెంబర్ 5: విశాఖ మన్యంలో బాక్సైట్‌పై అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలతో ఎటువంటి రక్షణ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆరోపించారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాక్సైట్ తవ్వకాలకు టీడీపీ, వైసీపీ ఎప్పుడూ అనుకూలమేనన్నారు. బాక్సైట్ తవ్వకాలకు ఒప్పందాన్ని కుదుర్చుకున్న అన్‌రాక్ కంపెనీకి ఈ రెండు పార్టీలు మద్దతిస్తున్నాయని ఆరోపించారు. మన్యంలో నల్లరాయి, లేటరేట్ వంటి ఖనిజ సంపదను ఇప్పటికే బినామీలకు అప్పగించి కొల్లగొడుతున్నారని ఆయన ఆరోపించారు. విభజన చట్టంలో పేర్కొన్న ఉత్తరాంధ్ర జిల్లాల ప్రత్యేక ప్యాకేజీపై ప్రతిపక్ష నేత జగన్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీతో కుమ్మకై లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్న జగన్ ఉత్తరాంధ్ర ప్రత్యేక ప్యాకేజీపై డిమాండ్ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న జ్ఞానభేరి, ధర్మపోరాటం, గ్రామ దర్శిని కార్యక్రమాలు రాజకీయ వేదికలుగా ముఖ్యమంత్రి చంద్రబాబు మార్చేశారన్నారు. పాడేరులో ఇటీవల నిర్వహించిన ఆదివాసీ దినోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి గిరిజన ఉత్సవం పేరిట ఆదివాసీలను భయబ్రాంతులకు గురిచేశారన్నారు. కనీస సదుపాయాలు లేకుండా గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు లేక విద్య కుంటుపడుతోందన్నారు. అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ మధ్య విధానరీత్యా ఎటువంటి వ్యత్యాసం లేదని, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి, ఆ పార్టీలో నుంచి ఈ పార్టీలోకి మారడం సర్వసాధారణంగా మారిందన్నారు. ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, కిడారి సర్వేశ్వరరావు డబ్బు కోసం అధికార పార్టీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. విలేఖరుల సమావేశంలో వామపక్ష నేతలు సుబ్బారావు, సీతారాములు, ఆవుల శేఖర్, లోకనాథం, ప్రభావతి, జేవీ సత్యనారాయణ, కిల్లో సురేంద్ర, పి.అప్పలనర్స పాల్గొన్నారు.

చిత్రం..విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం
రాష్ట్ర కార్యదర్శి మధు.