ఆంధ్రప్రదేశ్‌

చినబాబు రె‘డి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 8: తెలుగుదేశం పార్టీ ఉత్తరాధికారి లోకేష్ ఇక నేరుగా రంగంలోకి దిగనున్నారు. గడప గడపకూ వైసీపీ పేరుతో జనంలోకి వెళుతున్న జగన్ లక్ష్యంగా, లోకేష్ యాక్షన్‌ప్లాన్ రూపొందించారు. అందులో భాగంగా, పైనుంచి కింది స్థాయి నేతల వరకూ అందరికీ శిక్షణ శిబిరాలు నిర్వహించి, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు. పార్టీ సీనియర్ నేతలతో ఏర్పడిన కమిటీ శుక్రవారం లోకేష్ నాయకత్వాన భేటీ అయి, కీలక నిర్ణయాలు తీసుకుంది. తొలిసారి లోకేష్ ఆధ్వర్యాన వ్యూహబృందం తన భవిష్యత్తు కార్యాచరణకు మెరుగులు దిద్దింది. ఇక దీనితో పార్టీలో లోకేష్ శకం మొదలయినట్లుగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
యనమల, వైబి రాజేంద్రప్రసాద్ మినహా సీనియర్లంతా హాజరైన ఈ సమావేశంలో ప్రతిపక్షాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు, మొదట కింద నుంచి పైస్థాయి వరకూ శిక్షణ తరగతులు నిర్వహించి, అక్కడి నుంచే వారికి దిశానిర్దేశం చేయాలని నిర్ణయించారు. ఆ ప్రకారంగా రాష్ట్రంలో నియోజకవర్గ స్థాయిలో అన్ని అంశాల్లో విజయం సాధించిన 25 మంది ఎమ్మెల్యేలను ఎంపిక చేసుకుని, వారితో మిగిలిన వారికి శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. గురువారం బాబు సమక్షంలో ఇదే అంశంపై ప్రాథమిక చర్చ జరిగింది. ఇప్పుడు దానికి కార్యాచరణ జోడించారు. అందులో భాగంగా 175 నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యే, ఇన్చార్జిలు, 25 పార్లమెంటు నియోజకవర్గ పరిథిలోని ఎంపిలు, ఇన్చార్జిలు, నియోజకవర్గాల్లో ప్రభావితం చేయగలిగిన 500 మంది నేతలు, ఐదువేలమంది ఎంపిటిసి, జడ్పీటీసీలు, సర్పంచులు, ఇప్పటికే శిక్షణ పొందిన 32500 మంది నేతలకు అక్టోబర్‌లోగా శిక్షణ శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించారు. వీటికి చంద్రబాబు సహా మంత్రులు అంతా హాజరవుతారు.
అదే సమయంలో గడప గడపకు వైసీపీ నినాదంతో జనంలోకి వెళుతున్న ఆ పార్టీ అధినేత జగన్‌ను ఎలా ఎదుర్కోవాలన్న అంశంపైనా చర్చ జరిగింది. పార్టీ-ప్రభుత్వంపై జగన్ చేస్తున్న దుష్ప్రచారం తిప్పికొట్టాలని నిర్ణయించారు. జగన్-కేసీఆర్ కలసి ఏపి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఏపి సర్కారుపై పెట్టిన కాపీరైట్ కేసును జగన్‌కు చెందిన సాక్షిలో ఏపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసి, రాష్ట్ర ద్రోహానికి పాల్పడిన వైనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. జగన్ తన మీడియా ద్వారా రాష్ట్భ్రావృద్ధిని అడ్డుకోవడంతోపాటు, పెట్టుబడిదారులను భయపెట్టేలా ప్రచారం చేస్తున్నారని దానిని కూడా జనంలోకి తీసుకువెళ్లనున్నారు.
ఇప్పటివరకూ ప్రభుత్వం ప్రజలకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపైనా చర్చ జరిగింది. ‘మనం ఇప్పటివరకూ 70, 80 శాతం ఇచ్చిన హామీలు నెరవేర్చాం. అందులో ఇవ్వని హామీలు కూడా ఉన్నాయి. వాటిని విస్తృతంగా మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి.
మనం చేసిన పనులను ప్రచారం చేసుకోలేకపోతున్నాం. ఇకపై ఆ వైఖరి విడనాడాలి’ అని లోకేష్ స్పష్టం చేశారు. ఇకపై నెలకు రెండుసార్లు భేటీ కావాలని నిర్ణయించారు.