ఆంధ్రప్రదేశ్‌

మీ వ్యవహార శైలి నచ్చకే బయటకు వచ్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటి), సెప్టెంబర్ 5: వయస్సులేదు...అనుభవం లేదు...ఆలోచన లేదు..ప్రజలకు మేలు చేయాలనే తపన లేదు..సలహాలు వినే నైజం లేదు..కేవలం నీ సహ నిందితుల సలహాలతోనే ముందుకు సాగాలన్న నీ అలోచన భరించలేకనే వైకాపాను వీడామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అధికారమే పరమావధిగా సాగుతున్న కుట్ర రాజకీయాలను ప్రత్యక్షంగా చూసి భరించలేక, రాష్ట్భ్రావృద్దిని కాంక్షిస్తూ పని చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబును బలపరిచామన్నారు. అంతర్గత సమావేశాల్లో జగన్ వ్యక్తపరిచిన దురభిప్రాయాలతో ఏకీభవించలేకనే పార్టీని వీడినట్లు బుధవారం వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌కు రాసిన బహిరంగ లేఖలో ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. వైకాపా ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబుకు జగన్ రాయించిన లేఖకు బవాబుగా, జరిగిన అన్ని అంశాలను ప్రజల దృష్టికి తెచ్చేందుకు ఈ బహిరంగ లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా పార్టీ అంతర్గత సమావేశాల్లో పట్టిసీమ నిర్మాణాన్ని అడ్డుకోవడం, పోలవరం నిర్మాణాన్ని, పేద గిరిజనుల పునరావాసాన్ని ముందుకు సాగకుండా ప్రజలను ప్రభుత్వంపైకి ఉసిగొల్పడం, కొత్త రాజధాని ఏర్పాటు కాకుండా అడ్డుకోవడం, రాజధాని ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్‌పై అపోహలు సృష్టించాలని చెప్పడం, రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడం కోసం కోర్టులో కేసులు వేయాలనే జగన్ అలోచనలతో ఏకీభవించలేక వైకాపాను వీడామన్నారు. అలాగే రాజధాని నిర్మాణంలో భాగమైన పలు సంస్థలపై అసత్యాలతో అడ్డుకోవాలన్న ఆలోచనతో లేఖలు రాయడం, ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూల్చివేయాలని రాజ్‌భవన్ సాక్షిగా జగన్ చేసిన ప్రకటన భరించలేకపోయామన్నారు. శాసన సభలో ప్రజాసమస్యలు లేవనెత్తకుండా, చర్చ జరగకుండా, దుష్ట రాజకీయ తలంపుతో ఎమ్మెల్యేలను ఉసికొల్పడం సహించలేక పోయామన్నారు. రాష్ట్రానికి ఉపాధి హామీ కూలీల నిధులు రాకుండా చేయలనే జగన్ వక్రబుద్ధి తమకు నచ్చలేదన్నారు. కేసుల మాఫీ కోసం కేంద్రంలోని బీజేపీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు సహించలేకపోయామన్నారు. రాష్ట్రానికి నమ్మకద్రోహం చేసిన నరేంద్రమోదీని రాష్టమ్రంతా వ్యతిరేకిస్తుంటే పల్లెత్తు మాట అనలేని, జగన్ ఉత్తర కుమార నైజాన్ని చూసి తట్టుకోలేక పోయామన్నారు. ఫ్యాక్షన్ పునాదుల మీద నిర్మితమైన జగన్ ఫ్యూడల్ మనస్తత్వాన్ని సమర్థించలేక, మానసిక సంఘర్షణ భరించలేక, ప్రజల కోసం ప్రజాస్వామ్యం దిశగా అడుగులు వేశామన్నారు. ప్రతి శుక్రవారం కోర్టుల చుట్టూ జగన్ తిరుగుతుంటే, మమ్మల్ని కూడా ప్రజలు అలాగే చూస్తుంటే ఓర్చుకోలేక పోయామన్నారు.
అసలు ఫిరాయింపులు జగన్ కుటుంబం నుండే ప్రారంభమైయ్యాయన్నారు. నాటి ప్రతిపక్షనేత భాట్టం శ్రీరామమూర్తి మీ నాన్నపై చేసిన వ్యాఖ్యలు గుర్తించు కోవాలన్నారు. 1978లో రెడ్డి కాంగ్రెస్ టిక్కెట్టు మీద గెలిచిన మీ నాయన వైఎస్ తరువాత రాజీనామా చేయకుండానే ఇందిరా కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవి తీసుకోలేదా, అప్పుడు మీ విలువలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 1993లో ఏడుగురు టీడీపీ ఎంపీలను కాంగ్రెస్‌లోనికి లాక్కున్నప్పుడు ఈ విలువలు ఏమయ్యాయన్నారు. 2004లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పది మందిని తీసుకున్నప్పుడు జగన్ తండ్రి వైఎస్ చేసింది పవిత్రమైన ప్రజాస్వామ్య యజ్ఞమా, రాజ్యాంగ పునరుద్ధరణ కార్యక్రమమా అని ప్రశ్నించారు. అణు ఒప్పందం మీద పార్లమెంటులో ఓటింగ్ సందర్భంగా ఇద్దరు టీడీపీ ఎంపీలను లాక్కుని వైఎస్ పదవులు ఇచ్చిన విషయం రాష్ట్ర ప్రజలు మరిచి పోయారనుకుంటున్నావా అని ప్రశ్నించారు. 2009లో బాలనాగిరెడ్డి, ప్రసన్నకుమార్‌రెడ్డిలను తీసుకున్నప్పుడు ఎందుకని రాజీనామాలు చేయింలేదన్న వారు మీరు చేస్తే సంసారం ఇతరులు చేస్తే వ్యభిచారమా అని ప్రశ్నించారు. అభివృద్ధి కోణంలో జగన్‌కు చంద్రబాబుకు పోలిక లేదన్నారు. సీఎం పదవి కోసం ప్రధానిపై చెప్పులు వేయించిన తండ్రి వారసత్వం నీది, కుర్చీ కోసం హైదరాబాద్‌లో మతకల్లోలాల్లో 300 మంది ప్రాణాలు బలిగొన్న రాక్షస వారసత్వానికి కొనసాగింపు నీది అన్నారు. రాష్ట్భ్రావృద్ధికి కలసిరాని, ఐదు కోట్ల ప్రజలకు నమ్మకద్రోహం చేస్తున్న జగన్ నైజాన్ని బహిర్గత పరచడానికే ఈ లేఖ రాస్తున్నట్లు స్పష్టం చేశారు. రాష్ట్రం కోసం, భవిష్యత్ తరాల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబును బలపరచడం ప్రతి తెలుగువాడి తక్షణ కర్తవ్యం, అందుకే మేము సైతం అంటూ చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తున్నట్లు వారు వివరించారు.