ఆంధ్రప్రదేశ్‌

కోడెల నిస్సహాయత చూసి జాలేస్తోంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 5: రాజ్యాంగ పదవిలో ఉన్న శాసన సభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అసత్యాలు, తప్పుడు గణాంకాలతో తమకు అనుకూలంగా ప్రచారం చేయించుకుంటున్నదని కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు ఆరోపించారు. దీని వల్ల ఉన్నతమైన స్పీకర్ పదవికే కళంకం ఏర్పడే అవకాశం ఉన్నదన్నారు. గతంలో తాను రాసిన లేఖకు స్పీకర్ ప్రభుత్వంతోనే సమాధానం రాయించారన్నారు. కనీసం అందులోని తప్పొప్పులను కూడా పరిశీలించలేదన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్నభవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదే సందర్భంగా మరో 27 ప్రశ్నలు సంధిస్తూ స్పీకర్ డాక్టర్ కోడెలకు మరో లేఖ రాశారు. ఈ సందర్భంగా కేవీపీ మాట్లాడుతూ పోలవరం అంటే కేవలం హెడ్ వర్క్స్ మాత్రమేనంటూ సమాధానం రాపిస్తున్న ప్రభుత్వం అవగాహన రాహిత్యమా లేక ప్రజల పట్ల నిర్లక్ష్యమా విజ్ఞులైన కోడెల చెప్పాలన్నారు. గతంలో భారీ నీటి పారుదల శాఖను నిర్వర్తించిన అనుభవం ఏమైందన్నారు. ఏది ఏమైనా ఈ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగానే తప్పుడు సమాచారం ఇస్తున్నదన్నారు. కనీసం స్పీకర్ పదవికి ఉండే గౌరవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవడం లేదన్నారు. పోలవరం గురించి స్పీకర్ ఇంకా వివరాలు తెలుసుకోవాలనే నేడు 27 ప్రశ్నలు పంపుతున్నానని, కనీసం వీటిని ముఖ్యమంత్రి చంద్రబాబు, సంబంధిత మంత్రితో నిమిత్తం లేకుండా అధికారుల నుంచి నేరుగా సమాధానాలు తెప్పించుకుని పరిశీలించి పత్రికలకు వాస్తవాలు తెలియపరచాలని కేవీపీ విజ్ఞప్తి చేశారు. కేంద్రంలో యుపీఏ ప్రభుత్వ హయాంలోనే పోలవరానికి అన్ని అనుమతులు వచ్చాయని అన్నారు.