ఆంధ్రప్రదేశ్‌

కుటుంబరావుతో చర్చకు సిద్ధం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 6: అమరావతి బాండ్లు, రాజా ఆఫ్ కరప్షన్ పుస్తకం తదితరాలపై ఇటీవల తాను చేసిన విమర్శలపై చర్చకు రావాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు చేసిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రకటించారు. ఒక సెలవు రోజున నాలుగు గంటలపాటు చర్చిద్దామని, అది కుటుంబరావు ఇంట్లో అయినా లేదా రాజమహేంద్రవరంలోని తన మిత్రుడు చెరుకూరి రామారావు ఇంట్లో అయినా ఫర్వాలేదన్నారు. కేవలం ఇద్దరం మాత్రమే చర్చించుకుని, ఎవరికి వారు సెల్‌ఫోన్లలో రికార్డు చేసుకుని, ప్రజలకు విడుదల చేద్దామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో గురువారం విలేఖరుల సమావేశంలో ఉండవల్లి మాట్లాడారు. తాను డాక్యుమెంట్ల ప్రకారమే మాట్లాడతానన్నారు. అమరావతి బాండ్ల పేరిట సేకరించిన రూ.2000 కోట్లపై ఇచ్చే 10.36 శాతం వడ్డీలో 3 శాతం పన్నులు పోయి, ఆఖరికి మిగిలేది 8 శాతమే అని కుటుంబరావు పేర్కొన్నారని, అది ఎవరికి మిగిలేది అని ప్రశ్నించారు. బాండ్లపై మూడు నెలలకొకసారి వడ్డీ ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. మూడు నెలల్లో అమరావతి పూర్తికాదని, ఇవి అమరావతి బాండ్లుకాదని, రాష్ట్రం బాండ్లు అని ఎద్దేవాచేశారు.తాను చేసిన విమర్శలను కుటుంబరావు అంశాలవారీగా ఖండిస్తూ ‘రాజా ఆఫ్ కరెప్షన్’ అనే పుస్తకం అంశంపై కూడా చర్చకు సిద్ధమేనని చెప్పడాన్ని అభినందిస్తున్నానన్నారు. దీని గురించే కాదు ‘గుడ్-బ్యాడ్-అగ్లీ’ అనే పుస్తకంపై కూడా చర్చించడానికి తాను సిద్ధమేనన్నారు. రాజా ఆఫ్ కరెప్షన్ పుస్తకంలో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ సంతకం పెట్టి ఇచ్చిన కాగితాలు తప్ప టీడీపీ ప్రత్యేకంగా చేసిన ఆరోపణలేవీ లేవన్నారు. జగన్మోహన్‌రెడ్డికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సంబంధం ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు అన్నట్టుగా ఆ పుస్తకంలో ఉందని, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు అవసరమైన ఫీజు చెల్లిస్తే ఎవరికైనా సమాచారం వస్తుందని, అంతకు మించి ఏదో గొప్పగా బయటపెట్టిన అంశమంటూ ఏదీ లేదని ఉండవల్లి ఎద్దేవాచేశారు. ఇవన్నీ కోర్టులో ఉన్నాయని, దీనివల్ల ఇపుడు తాజాగా బయటకొచ్చేదేమింటే లక్ష కోట్లలో రెండు సున్నాలు తీసేయ్యాలా, మూడు సున్నాలు తీసెయ్యాలా అనే విషయం తేలనుందన్నారు. తాను ట్రేడింగ్ జర్నలిస్ట్ కుటుంబరావు అంతటి ఆర్థిక నిపుణుడిని కాదన్నారు. చంద్రబాబుపై తనకు ఈర్ష్య అని కామెంట్ చేశారని, నిజంగా ఆయనపై తనకు ఈర్ష్యే ఉంటే ఇటీవల రాష్ట్ర విభజన విషయమై ఆయనను కలిసేవాడినే కాదన్నారు. గోదావరి జిల్లాకు చెందిన వాడిని కావడంవల్ల తాను మాట్లాడేదాంట్లో కాస్త హ్యూమర్ ఉంటుందన్నారు.
కాంగ్రెస్ అంటే మహాత్మాగాంధీ వంటి సచ్ఛీలత కలిగినదనీ, రాజశేఖర్‌రెడ్డి వివేకానందుడంతటి వాడని, అవినీతి అంటే ఆయనకు తెలియదని, నిప్పని తాను ఎపుడైనా చెప్పానా అని ఉండవల్లి ప్రశ్నించారు. ‘మనీ మేకింగ్ వేరు, మనీ టేకింగ్ వేరన్నారు. రాజశేఖర్‌రెడ్డి ఎపుడూ మనీ టేకింగ్ తప్ప, మనీ మేకింగ్ చేయలేదన్నారు. కలెక్షన్ చేశాడు తప్ప కరప్షన్ చేయలేదన్నారు. మార్గదర్శి ఉదంతంలో వారు వేసిన కేసులో తాను తప్పించుకోవడానికి ప్రయత్నించానని కుటుంబరావు ఆరోపించారని, ఆ కేసులో స్టే రద్దు చేయించుకోవాల్సిన బాధ్యత మార్గదర్శి వారిదే అయినప్పటికీ తాను రద్దు చేయించుకోవడానికి ప్రయత్నిస్తానని, అపుడు అన్ని నిజాలు బయటకు వస్తాయని ఉండవల్లి పేర్కొన్నారు. పట్టిసీమ, పోలవరం, అమరావతిపైనా డాక్యుమెంట్లు చూపిస్తానన్నారు.

చిత్రం..విలేఖర్లతో మాట్లాడుతున్న ఉండవల్లి