ఆంధ్రప్రదేశ్‌

ఒలింపిక్స్‌పై గురి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, సెప్టెంబర్ 7: పదేళ్ల కల నెరవేరిందని, 2020 ఒలింపిక్స్ నా టార్గెట్ అని భారత మహిళా హాకీ గోల్‌కీపర్, చిత్తూరు జిల్లా యర్రావారిపాళ్యం మండలం యమమలవారిపల్లె గ్రామానికి చెందిన రజనీ వెల్లడించింది. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న రజనీకి విద్యార్థులు, జిల్లా హాకీ క్రీడా అసోసియేషన్ సభ్యులు పుష్పగుచ్ఛాలిచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ ఏషియన్ గేమ్స్‌లో 20 ఏళ్ల తరువాత భారత్ సిల్వర్ మెడల్ సాధించడం తనకెంతో ఆనందంగా ఉందని, ఈ మెడల్ సాధించడంతో తన పదేళ్ల కల నెరవేరిందన్నారు. 2020వ సంవత్సరంలో జరుగనున్న ఒలంపిక్స్ నా టార్గెట్ అని, అందులో ఐక్యంగా హాకీ టీం సభ్యులు అత్యున్నతమైన ప్రదర్శన కనబరిచి గెలుపొంది భారత కీర్తిప్రతిష్టను, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి పేరు తీసుకువస్తానన్నారు. కడు పేదరాలినైన తనకు కష్టాల్లో సహాయం చేసిన ప్రతి ఒక్కరూ తనకు గుర్తున్నారని, వారికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. తన ఎదుగుదలను ప్రోత్సహించిన తల్లిదండ్రులు హాకీ కోచ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. అనంతరం భారీ ర్యాలీగా తిరుపతికి బయలుదేరి వెళ్లారు. రజనీకి స్వాగతం పలికిన వారిలో జిల్లా క్రీడాధికారిణి సీఈఓ లక్ష్మీ, ఒలంపిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శాంతారెడ్డి, శ్రీ్ధర్, రాష్ట్ర హాకీ అసోసియేషన్ కార్యదర్శి ప్రసన్నకుమార్ రెడ్డి, సీకాం డైరెక్టర్ సురేంద్రరెడ్డి, మునిసిపల్ కార్పొరేషన్ డీవైఈఓ ఆనంద్‌కుమార్, ఎస్‌ఎస్ మణిరత్నం, భాస్కరయ్య, విజయ్‌కుమారి, సుధ, రాజనరసింహులు, నరేష్, లత ఉన్నారు.