ఆంధ్రప్రదేశ్‌

పోలవరం జలాల్లో వైసీపీ కొట్టుకుపోతుంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 8: వచ్చే ఏడాది పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిచేసి గ్రావిటీ ద్వారా నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, ఆ నీటిలో ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ కొట్టుకుపోవటం ఖాయమని దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికలతో వైసీపీ కనుమరుగవటం ఖాయమని శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. జలయజ్ఞం పేరుతో వేలకోట్లు దోచేసిన ప్రతిపక్షనేత జగన్ పోలవరంపై అబద్ధపు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరం పనులు సమర్థవంతంగా జరుగుతున్నాయని స్వయాన కేంద్ర బృందం ప్రశంసిస్తే పచ్చకామెర్ల రోగిలా విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రులు, అధికారులు, సీడబ్ల్యూసీ, రైతులు, ప్రజలు పోలవరం ప్రాజెక్టు పనులు చూసి హర్షామోదాలు తెలుపుతున్నారని చెప్పారు. గతంలో జగన్ పోలవరం నిర్వాసితులు, రైతుల్ని రెచ్చగొట్టేందుకు విఫలయత్నం చేశారన్నారు. గిరిజనులు, రైతులకు లబ్ధి చేకూరేందుకు నష్టపరిహారం పెంచి అంచనాలను కేంద్రానికి సమర్పిస్తే విమర్శించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైసీపీ మునిగిపోయే పడవలాంటిదన్నారు. ఇప్పటికే ఆ పార్టీ పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, అవినీతి కేసుల మాఫీ కోసం బీజేపీతో జగన్ లాలూచీ పడినట్లు ప్రజలు గ్రహిస్తున్నారని తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ నిధులు, నష్టపరిహారంపై ఏనాడైనా జగన్ కేంద్రాన్ని ప్రశ్నించారా అని నిలదీశారు. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాలతో కాళ్లబేరానికే వైసీపీ నేతలు ఢిల్లీలో లాబీయింగ్ చేస్తున్నారని పోలవరం, రాజధాని నిర్మాణాలపై కేంద్రాన్ని ప్రశ్నించే ధైర్యం లేదని విమర్శించారు. కేవలం 414 పనిదినాల్లో పోలవరం డయాఫ్రం వాల్ పూర్తయిందని, 58 శాతం పనులు పూర్తయ్యాయని వివరించారు. సుమారు మూడువేల మంది కార్మికులు రేయింబవళ్లు శ్రమించి జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి అత్యాధునిక యంత్రాలు తెప్పించి పనులు నిర్వహిస్తుంటే వైసీపీ విమర్శలు చేయటం తెలుగుజాతికి ద్రోహం చేయటమే అన్నారు.