రాష్ట్రీయం

టి.టిడిపి నేతలతో నారా లోకేష్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 9: తెలంగాణ తెలుగు దేశం పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై 10 వేర్వేరు కమిటీలను నియమించాలని ఆ పార్టీ నిర్ణయించింది. శనివారం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ టి.టిడిపి ముఖ్య నాయకులతో సమావేశమై సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు పోరాటం చేసేందుకు, అంశాలను ఎంపిక చేసేందుకు వేర్వేరు కమిటీలను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. సమావేశానంతరం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి రావుల చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై నారా లోకేష్ దిశా నిర్దేశం చేశారని చెప్పారు.