ఆంధ్రప్రదేశ్‌

నాలుగేళ్లలో గ్రామాల్లో 16, 685 కి.మీ మేర మట్టిరోడ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం 2006లో అమల్లోకి తీసుకురాగా 2014 వరకు ఒక్క కి.మీ రోడ్డు కూడా వేయలేదని, గత నాలుగేళ్లలో రూ. 683 కోట్లు ఖర్చుతో 16,685 కి.మీ మేర మట్టిరోడ్ల నిర్మాణం చేపట్టామని, ఈ సంవత్సరం మరో వెయ్యి కి.మీ మేర రోడ్లు వేసేందుకు రూ. 70 కోట్లు మంజూరు చేసామని రాష్ట్ర పంచాయతీ శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాలలో అధికార పక్ష సభ్యులు బీసీ జనార్ధన్‌రెడ్డి, డాక్టర్ అప్పలనాయుడు, జోగేశ్వరరావు, సూర్యారావు, నిమ్మల రామానాయుడు, సర్వేశ్వరరావు తదితరులు లోకేష్ హయాంలో గ్రామాల్లో పంచాయతీలు, అంగన్‌వాడీలకు నూతన భవనాలు ఏర్పాటయ్యాయని, మంచి రోడ్లు పడుతున్నాయని ఒకరిని మించి మరొకరు పోటాపోటీగా పొగడ్తలతో ముంచెత్తారు. అయితే పొలాల్లోకి వెళ్లేందుకు డొంకరోడ్లు సరిగాలేక నాట్లు వేసుకోటానికి ఎరువులు తీసుకెళ్లడానికి, ఆపై ఉత్పత్తులను తెచ్చుకోడానికి రైతులంతా ఎన్నో వ్యయప్రయాసలకు గురి కావాల్సి వస్తున్నదన్నారు. గతంలో 50 కిలోల గోతం మోసే రైతు నేడు 25 కిలోలకు మించి మోయగల్గే స్థితిలేదని, ట్రాక్టర్‌లు ఎడ్ల బండులు కూడా వెళ్లలేక అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకెత్తి రంగు మారి ఆపై అయినకాడికి అమ్ము కోవాల్సి వస్తున్నదన్నారు. రాయలసీమ ఎలా ఉన్నా డెల్టా ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షాలకే రోడ్లు దెబ్బతింటున్నాయని అన్నారు. స్పీకర్ కోడెల కూడా జోక్యం చేసుకుంటూ సభ్యులందరూ డొంక రోడ్ల గురించి మాట్లాడుతున్నందున వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నరేగా నిధులను రోడ్ల నిర్మాణానికి పూర్తిగా కేటాయిస్తున్నామని ఈ విషయంలో కేంద్ర మంత్రి తనను ఎంతగానో ప్రశంసిస్తూ అవసరమైతే మరిన్ని నిధులు ఇవ్వగలనని కూడా చెబుతున్నారని మంత్రి లోకేష్ అన్నారు. ఈ దశలో బీజేపీ సభ్యులు మాణిక్యాలరావు జోక్యం చేసుకుంటూ అంత భారీగా నిధులిస్తున్న ప్రధాని మోదీకి కనీసం కృతజ్ఞతలు తెలుపకపోవడం విచారకరమని అన్నారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందిస్తూ నిధులు ఎంతో పారదర్శకంగా ఖర్చు చేస్తున్నాం కేంద్రం నుంచి పలుమార్లు ఆడిట్ బృందాలు వచ్చి సంతృప్తి చెందాయి పైగా అనేక అంశాలలో దేశం మొత్తంపై ప్రథమ స్థానంలో అవార్డులు వస్తున్నాయని అన్నారు. అటు బీజేపీ ఇటు వైకాపా సభ్యులు కొందరు నిధులను నీరు - చెట్టు ఇతర పథకాలకు మళ్లిస్తున్నారని అవినీతి జరుగుతున్నదంటూ కేంద్రానికి పదేపదే తప్పుడు ఫిర్యాదు చేస్తుంటే నిజమేనని భావించి, కేంద్రం ఆడిట్ బృందాలను పంపుతున్నారని అయినా ఇబ్బందేమీలేదని తేల్చి చెప్పారు.