ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో పాలిటెక్ ఫెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 10: దేశంలోనే నవ్యాంధ్రను ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా విద్యలో సంస్కరణలు తీసుకువస్తున్నామని, పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్యను తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సాంకేతిక విద్యను మరింత బలోపేతం చేసే క్రమంలో రాష్ట్రంలో మొదటి సారిగా పాలిటెక్ ఫెస్ట్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 23, 24 తేదీల్లో వైజాగ్‌లోని ఏయూ కనె్వన్షన్ సెంటర్ కేంద్రంగా పాలిటెక్ ఫెస్ట్ -2018ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పోటీల్లో విజేతలుగా ఉన్న 20 నుండి 30 ప్రదర్శనలు ఇందులో ఉంటాయన్నారు. జిల్లా స్థాయిలో మొదటిగా నిలిచిన వాటినే రాష్ట్ర స్థాయిలో ప్రదర్శిస్తామన్నారు. డిజిటల్, వర్చువల్ తరగతుల ఏర్పాటుతో పాటు పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సాంకేతిక విద్యలో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. ఇందులో గెలుపొందిన వాటికి నగదు బహుమతులను కూడా అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సారి జ్ఞానభేరి కృష్ణా విశ్వవిద్యాలయంలో ఈనెల 19న నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సంబందించి ఏపీపీఎస్సీ నిర్వహించిన అర్హత పరీక్షలో 3240 మంది అర్హత సాధించారని, వీరిని ఆయా వర్శిటీలు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేసుకుంటాయని చెప్పారు. జూనియర్ లెక్చరర్లు 108 మందికి పదోన్నతలు కల్పించామన్నారు. రాష్ట్రంలో డీఎస్సీ నిర్వహణకు ఆర్థిక శాఖ కొర్రీలు వేస్తోందన్నారు. త్వరలోనే దానికి సంబంధించిన అనుమానాలను ఆధికారులు నివృత్తి చేస్తున్నారని, అది పూర్తియిన వెంటనే డీఎస్సీని నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన పాలిటెక్ ఫెస్ట్‌కు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు.