ఆంధ్రప్రదేశ్‌

పెట్రో అదనపు ఆదాయంపై శే్వతపత్రం విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 10: పెట్రోల్, డీజిల్ వల్ల వచ్చిన అదనపు ఆదాయంపై శే్వతపత్రం విడుదల చేయాలని కేంద్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిపై కేసులను నీరు కారుస్తున్నారని ధ్వజమెత్తారు. ముసుగు వీరుల ఆటలు సాగవని హెచ్చరించారు. పెరుగుతున్న పెట్రోల్, డీజల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర అసెంబ్లీలో సోమవారం ముఖ్యమంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సభలో బీజేపీ తరపున ఒక్కరే ఉన్నారని, వాస్తవాలను తెలపాలని, కప్పిపెట్టేందుకు ప్రయత్నించవద్దని బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజును ఉద్దేశించి అన్నారు. ఆత్మ విమర్శ చేసుకోవాలని, పెట్రోల్ , డీజల్ ధరలు తగ్గిస్తానని, అనివీతి భరతం పడతానని, నల్లధనాన్ని తెచ్చి, పంచుతానని మోదీ అన్న మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఓట్ల కోసం చెప్పారా? అని ప్రశ్నించారు. అంతర్జాతీయంగా ధరలు తగ్గినా, ధరలు తగ్గించుకుండా ఖజనా నింపుకున్నారన్నారు. పెట్రోల్‌పై 90 శాతం ఎక్సైజ్ డ్యూటీ విధించి వసూలు చేసుకున్నారని, డీజిల్‌పై 86 శాతం విధించి, వసూలు చేసుకున్నారని ఆరోపించారు. ఇది చోరీ కాదా? అని ప్రశ్నించారు. సెస్ ఇష్టానుసారంగా విధిస్తున్నారని, రోడ్ల అభివృద్ధి పేరుతో టోల్ వసూలు చేస్తున్నారన్నారు. త్వరలో పెట్రోల్, డీజల్ సెంచరీ కొట్టనున్నాయంటూ ప్రజలు జోక్‌లు వేస్తున్నా, చీమకుట్టినట్లైనా లేదన్నారు. ప్రజలు బాధ పడుతుంటే ప్రభుత్వం స్పందించాలన్నారు. రాష్ట్రానికి ఆదాయం తక్కువ ఉన్నా, మనసు ఉంది కాబట్టి తగ్గించామని తెలిపారు. పెట్రోల్‌పై విధించిన 90 శాతం ఎక్సైజ్ డ్యూటీని దేని కోసం ఖర్చు చేశారని ప్రశ్నించారు. పెట్రో అదనపు ఆదాయంపై శే్వతపత్రం విడుదల చేయాలన్నారు. ధరలను సమీక్షించాలని, ఎదురుదాడి సరికాదన్నారు. కేంద్రం తీరు ప్రజలు రోడ్లమీదకు వచ్చేలా చేస్తోందన్నారు. కేంద్రం అన్ని రంగాల్లో విఫలమైందని ఎద్దేవా చేశారు. ఏటీఎంల వద్ద డబ్బుల కోసం నిలబడాలా? జనం తిట్టుకుంటూ బతుకుతున్నారన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ జగన్‌తో తమకు ఏమీ సంబంధాలు లేవని, తనకు తెలియదని తెలిపారు.
దీనిపై సీఎం స్పందిస్తూ, జగన్ కేసులను నీరుకారుస్తున్నారని, చూపించమంటారా? అని ప్రశ్నించారు. చూపిస్తే పదవికి రాజీనామా చేస్తారా? అని ప్రశ్నించారు. సంవత్సర కాలంలో అవినీతి లేకుండా చేస్తానని, నల్ల ధనాన్ని ఖాతాల్లో వేస్తానని మోదీ చెప్పారన్నారు. తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారన్నారు. మోదీ, జగన్ ఒకే ముసుగు వేసుకున్నారని, ముసుగు వీరుల ఆటలు సాగవని హెచ్చరించారు. మళ్లీ విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల్లో వ్యాట్ 18 శాతం ఉందని, ఏపీలో 24 శాతం ఉందని, దీనిని తగ్గించాలన్నారు. పెట్రోల్, డీజల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నారు. పెట్రో అదనపు ఆదాయాన్ని రోడ్లకు ఖర్చు చేశారన్నారు. దీనిపై మరోసారి సీఎం మాట్లాడుతూ ఇబ్బందులు ఉన్నా, ధరలను తగ్గించామన్నారు. ఇబ్బందుల ఊబిలోకి నెడితే, సమస్యలు వస్తాయన్నారు. పెట్రోల్ ధర పెరగడం వల్ల తాను కూడా ఇబ్బంది పడుతున్నానని, ధర తగ్గించడంపై సీఎంను విష్ణుకుమార్ రాజు అభినందించారు.