ఆంధ్రప్రదేశ్‌

పోలవరంలో జాప్యం సహించను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: పోలవరం పనుల్లో జాప్యం సహించేదిలేదని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టంచేశారు. నిర్దేశిత గడువు లోగా పనులు పూర్తికావాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై సోమవారం సచివాలయం నుంచి వర్చ్యువల్ తనిఖీ నిర్వహించారు. ఇప్పటి వరకు పోలవరం పనులు 58.15 శాతం పూర్తయ్యాయి. ఇప్పటి వరకు 14వేల 600 కోట్లు ఖర్చుచేశాం.. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాక చేసిన ఖర్చు 9వేల 464 కోట్లు. రీయింర్స్‌మెంట్ చేసింది 6727 కోట్లు.. ఇంకా కేంద్రం నుంచి రావాల్సింది రూ 2736.94 కోట్లని ముఖ్యమంత్రి వివరించారు. ఈ మూడు నెలలు ప్రాజెక్టుల నిర్మాణానికి కీలకమన్నారు. సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు పనులు మరింత వేగం పుంజుకోవాలని ఆదేశించారు. గత వారంరోజుల్లో 0.25 శాతం మాత్రమే పనులు జరిగాయి. హెడ్ వాటర్ వర్క్స్ పనులు ఈ వారం 0.34 శాతం జరగ్గా మెయిన్ డ్యామ్ పనులు 0.36 శాతం పూర్తయ్యాయి. ఎక్స్‌కవేషన్, కాంక్రీట్ పనులు మరింత స్పీడ్‌గా చేపట్టాలని నిర్దేశించారు. ఎడమ ప్రధాన కాలువ పనులు 0.23 శాతం స్పిల్‌వే చానల్ పనుల్లో వేగం తగ్గిందన్నారు. కాంక్రీట్ పనుల్లో కూడా జాప్యం జరుగుతోందని అసంతృప్తి వ్యక్తంచేశారు. వర్షాలు లేకపోయినా పనులు ఎందుకు ముందుకు సాగటంలేదని ప్రశ్నించారు. పోలవరం పనులు మందకొడిగా సాగరాదని స్పష్టంచేశారు. మా మనవడు కూడా పోలవరాన్ని చూడాలనే ఉత్సాహంతో ఉన్నాడని అధికారులకు తెలిపారు. ఏం చేస్తున్నావురా అంటే పోలవరం కడుతున్నా అంటున్నాడు.. పిల్లలకు కూడా పోలవరం కట్టాలనే పట్టుదల ఉందన్నారు.పట్టుదలగా పనిచేసి అడ్డంకులను అధిగమించాలన్నారు. రాష్ట్రం అంతా ఉత్సాహ భరిత వాతావరణం ఉంది.. ఇదే స్ఫూర్తితో మరింత వేగంగా పనులు జరపగాలన్నారు.