ఆంధ్రప్రదేశ్‌

లాయర్లకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 12: దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న న్యాయవాదుల సమస్యలను పరిష్కరిస్తామని 2014 ఎన్నికలో మేనిఫేస్టోలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు అమలుచేస్తూ జీవోలు జారీచేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఆయన లేఖ రాశారు. ఇప్పటికే అనేకసార్లు మంత్రులకు, ప్రజాప్రతినిధులకు ఈ అంశంపై వినతిపత్రాలు అందించామన్నారు. 2018 జూన్ 9న విజయవాడలో జరిగిన న్యాయవాదుల సమావేశంలో అనేక వరాలు ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు వాటి అమలుకు జీవోలు జారీకాలేదన్నారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ ఇస్తున్న రూ.4 లక్షల డెత్ బెనిఫిట్‌కు అదనంగా మరో రూ.4 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్‌గా ఇచ్చి న్యాయవాదులను ఆదుకుంటామని హామీ ఇచ్చారని, ఈ హామీ అమలుకు ఇప్పటి వరకు జీవో రాలేదన్నారు. జర్నలిస్టులకు మాదిరిగానే అన్ని రకాల వైద్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తూ న్యాయవాదులకు హెల్త్‌కార్డులు మంజూరుచేస్తామని చేసిన హామీ కూడా కార్యరూపం దాల్చలేదన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ జూనియర్ న్యాయవాదులకు స్ట్ఫైండ్ రూపేణా నెలకు రూ.5000, పుస్తకాల కొనుగోలుకు రూ.20వేలు ఇస్తామని చెప్పారని,అర్బన్ హౌసింగ్ పధకంలో న్యాయవాదులకు ప్రత్యేక భవనాలను నిర్మిస్తామన్నారని, బార్ అసోసియేషన్ల లైబ్రరీల అభివృద్ధికి బార్ అసోసియేషన్ల స్థాయిని బట్టి రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామన్నారని, కానీ ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. ఏపీ బార్ కౌన్సిల్ పంపిన తీర్మానానికి అనుగుణంగా అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ చట్టాన్ని వెంటనే సవరించాలని,. న్యాయవాదుల సంక్షేమానికి రూ.150 కోట్లు మంజూరుచేయాలని లేఖలో కోరారు.