ఆంధ్రప్రదేశ్‌

18,450 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 18,450 పోస్టులను భర్తీ చేసేందుకు వీలుగా ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జారీ చేసింది. 182 గ్రూపు-1 పోస్టులు, 337 గ్రూపు-2 పోస్టులు, 1670 గ్రూపు-3 పోస్టులు, 3000 పోలీస్ ఎగ్జిక్యూటివ్, వైద్య శాఖలో 1604 పోస్టులు, 8275 టీచింగ్ పోస్టులు, మరో 1657 పోస్టులను, 725 అధ్యాపక పోస్టులను భర్తీ చేసందుకు ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ కేటగిరిల్లో నేరుగా ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. రాష్ట్ర అసెంబ్లీలో మంగళవారం ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో 24 గంటల్లోపుగా ఉత్తర్వులు జారీ చేయడం విశేషం.