ఆంధ్రప్రదేశ్‌

ముఖ్యమంత్రికి అనుకూలంగా జస్టిస్ సోమయాజులు నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 20: గోదావరి పుష్కరాల తొక్కిసలాటపై ప్రభుత్వం వేసిన జస్టిస్ సోమయాజుల కమిషన్ సీఎం చంద్రబాబు కనుసన్నల్లోనే కొనసాగిందని, ముఖ్యమంత్రికి అనుకూలంగానే జస్టిస్ సోమయాజులు నివేదక ఇచ్చారని సీపీఐ నేత రామకృష్ణ ఎద్దేవా చేశారు. విజయవాడ దాసరి భవన్‌లో గురువారం జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుష్కరాల తొక్కిసలాట వ్యవహారాన్ని మీడియాపైనా, ప్రజలపైనా రుద్ది ప్రభుత్వం నింద వేయడాన్ని ఖండించారు. మూఢత్వాన్ని రెచ్చగొట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని చెప్పారు. ఈయన్ని రక్షించాలనే సాకుతోనే ఏకపక్షంగా సోమయాజులు నివేదక ఇచ్చారని, దీనిపై పునర్విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాలను రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా నడిపి అపహాస్యంగా మార్చిందని, ప్రజా సమస్యల్ని తుంగలో తొక్కిందన్నారు. సచివాలయంలో టీడీపీ నేతలు, రాజధానిలో భూముల కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, కార్పొరేట్ వర్గాలకే ప్రభుత్వం చోటు కల్పిస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష పాత్రనే సరిగ్గా నిర్వర్తించని వైసీపీకి అధికారం కావాలంటూ ప్రజల్ని కోరే అర్హత లేదన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు వీ శ్రీనివాసరావు మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశాలను ఎమ్మెల్యేలకు పాఠాలు చెప్పే కౌన్సిలింగ్ కేంద్రాలుగా సీఎం చంద్రబాబు మార్చారని విమర్శించారు. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నించలేదన్నారు.