ఆంధ్రప్రదేశ్‌

పరిశ్రమలకు రాయితీలు.. తక్షణ అనుమతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమల స్థాపనకు అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నిరకాల అనుమతులతో పాటు వౌలిక సదుపాయాలను కల్పిస్తామని ఐటీశాఖ మంత్రి నారాలోకేష్ పారిశ్రామిక వేత్తలకు భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక విధానాలతో ఉపాధి కల్పనతో పాటు గ్రామీణ ఉత్పత్తులకు సైతం ప్రపంచ మార్కెట్‌లో స్థానం కల్పించే దిశగా పురోగమిస్తున్నట్లు చెప్పారు. ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీకి, ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రపంచంలోనే పేరుగాంచిన చైనాలోని షెన్‌జెన్‌లో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ శనివారం వివిధ సంస్థ ప్రతినిధులతో కీలక భేటీలు నిర్వహించారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించగా చైనాలోని పలు సంస్థలు సంసిద్ధత వ్యక్తంచేశాయి.
అక్టోబర్‌లో ఏపీకి టోంగ్డా బృందం
మొబైల్ ఫోన్ల ప్లాస్టిక్ కేసింగ్ తయారీలో ఉన్న టోంగ్డా కంపెనీ వైస్ చైర్మన్ వాన్గ్‌యాహువాతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు కీలక అంశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమ స్థాపించాలని అనుకుంటే 21 రోజుల్లో అన్నిరకాల అనుమతులు మంజూరు చేస్తామని, సంస్థ ఏర్పాటుకు అవసరమైన వౌలిక సదుపాయాలను ప్రభుత్వమే కల్పిస్తుందని లోకేష్ భరోసా ఇచ్చారు. దీనిపై టోంగ్డా వైస్‌చైర్మన్ స్పందిస్తూ వచ్చేనెల రెండవ వారంలో ఆంధ్రప్రదేశ్‌కు తమ ప్రతినిధుల బృందాన్ని పంపుతామని, సుమారు 5వేల మందికి పైగా నిపుణులు తమకు అవసరమని వివరించారు. ఏపీలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని, నైపుణ్యత శిక్షణ ఇచ్చి టోంగ్డా కంపెనీలో ఉద్యోగాలు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. టోంగ్డా కంపెనీ 50 శాతానికి పైగా షామి ఫోన్లకు టోంగ్డా ప్లాస్టిక్ కేసులు వినియోగిస్తున్నారు. చైనాలో ఈ ప్లాస్టిక్ కేసులు ఉత్పత్తి చేస్తున్న ఈ సంస్థలో సుమారు 24వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు.
సీవీటీఈ కార్యకలాపాల విస్తరణ
కాంపొనెంట్స్ బిజినెస్, ఫ్యూచర్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ ఎడ్యుకేషన్, ఇంటెలిజెన్స్ హార్డ్‌వేర్, ఆర్ట్ఫిషియల్ ఇంటెలిజెన్స్, హెల్త్‌కేర్‌లో ఐటీ సేవలు అందిస్తున్న సీవీటీఈ కంపెనీ డైరెక్టర్ హువాంగ్ జేన్కాంగ్‌తో మంత్రి లోకేష్ చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ రంగం అభివృద్ధికి ప్రవేశపెట్టిన డీటీపీ పాలసీ గురించి వివరించారు. ఏపీకి ఇప్పటికే ఫ్రాంక్లిన్, కాన్డ్యూయెంట్, హెచ్‌సీఎల్, జోహో లాంటి పెద్ద కంపెనీలు పెట్టుబడులు పెట్టాయని, ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఉందని లోకేష్ వివరించారు. త్వరలో తమ కంపెనీ ఉన్నత బృందం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తుందని, ఆ తరువాత పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటామని డైరెక్టర్ హామీ ఇచ్చారు.
రియల్‌టైమ్ గవర్నెన్స్‌కు హువావే సహకారం
షెన్‌జెన్‌లోని హువావే కంపెనీ కేంద్ర కార్యాలయాన్ని మంత్రి లోకేష్, ఐటీ అధికారులు సందర్శించారు. 170 దేశాల్లో వ్యాపారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 500 కంపెనీల్లో 72వ స్థానం, అన్ని దేశాల్లో కలిపి లక్షా 80వేల మంది ఉద్యోగులు, 36 జాయింట్ ఇన్నోవేషన్ సెంటర్లు కలిగి ఉన్న హువావే సంస్థ ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగ అభివృద్ధిలో కీలక భూమిక వహిస్తోంది. క్లౌడ్ డేటా సెంటర్లు, ఎంటర్‌ప్రైజ్ కొలాబొరేషన్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఎంటర్‌ప్రైజ్ వైర్లెస్ సర్వీసెస్ సేవలను సంస్థ అందిస్తోంది. వీటితో పాటు సీసీ కెమేరాలు, మొబైల్ రౌటర్లు, సర్వర్లు తయారుచేసే సంస్థ వైస్‌ప్రెసిడెంట్ హాన్ జియోతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఈ గవర్నెన్స్- ఫైబర్ గ్రిడ్, రియల్‌టైం గవర్నెన్స్ వినియోగంతో పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. రియల్‌టైమ్ గవర్నెన్స్‌ను మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని, స్మార్ట్ సిటీలు, స్మార్ట్ గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా ఎంచుకున్నామని, దీనికి హువావే సహకారం అందించాలని కోరారు. దీనిపై స్పందించిన హువావే వైస్‌ప్రెసిడెంట్ ఆంధ్రప్రదేశ్‌తో కలసి పనిచేసేందుకు సంసిద్ధత తెలిపారు. ఏపీ పాలసీలు.. విజన్ తమకు నచ్చాయని, రియల్‌టైం గవర్నెన్స్, స్మార్ట్ గ్రామాల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు.
ఆస్ట్రమ్‌తో మరో 3 కంపెనీల ఒప్పందం
షెన్‌జెన్‌లో ఆస్ట్రమ్ కంపెనీ ఆధ్వర్యంలో హాంకాంగ్, చైనా ఇనె్వస్టర్ల సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఇదివరకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఆస్ట్రమ్‌తో కలసి పెట్టుబడులు పెట్టేందుకు ఎల్‌ఎల్కే డిజైన్, షేన్‌జెన్ పవర్‌టెక్నాలజీ, డాన్గువాన్ వైజి ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ కంపెనీలు ముందుకొచ్చాయి. మంత్రి లోకేష్ సమక్షంలో ఆస్ట్రమ్‌తో ఈ మూడు కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో భాగంగా తిరుపతిలో ఎల్‌ఎల్కే డిజైన్ సంస్థ ఇన్నోవేషన్ డిజైన్ సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. షెన్‌జెన్ పవర్ టెక్నాలజీ సంస్థ కూడా తిరుపతిలో తయారీ సంస్థను నెలకొల్పనుంది. డాన్గువాన్ వైజీ ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీ సంస్థ సాంకేతిక సహకారం అందించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. గతంలో చేసుకున్న ఒప్పందం మేరకు ఆస్ట్రమ్ రూ 100 కోట్ల పెట్టుబడితో తిరుపతి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో కంపెనీ ఏర్పాటు చేయనుంది. ఆడియో పరికరాలు, ఎల్‌ఈడీ లైట్లు, సెల్‌ఫోన్, లాప్‌టాప్ యాక్ససరీస్, కంప్యూటర్ కాంపొనెంట్స్, గేమ్ కంట్రోలర్స్ వంటి కన్జూమర్ ఎలక్ట్రానిక్ తయారీలో అనుభవం ఉన్న ఆస్ట్రమ్ ఈ మూడు కంపెనీలతో కలిపి కార్యకలాపాలు మరింత విస్తరించనుంది. ఏపీలో పెట్టుబడులకు ముందుకువచ్చిన సంస్థల ప్రతినిధులను మంత్రి అభినందించారు. షెన్‌జెన్ కంపెనీల సందర్శన, సమావేశాలు, చర్చల్లో ఐటీ కార్యదర్శి విజయానంద్, సీఈఒ భాస్కర్‌రెడ్డి, ఆస్ట్రమ్ కంపెనీ సీఈఒ మనోజ్‌కుమార్, వివిధ ఎలక్ట్రానిక్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.