ఆంధ్రప్రదేశ్‌

వామపక్షాల ఐక్యత అవశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: వామపక్ష పార్టీలన్నీ ఐక్యం కావాలని మాజీ ఎంపీ, అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) జాతీయ కార్యదర్శి దేవబ్రత బిశ్వాస్ ఆకాంక్షించారు. దేశ సంపదను కార్పొరేట్లు దోచుకుంటున్నారని, వీరికి ప్రభుత్వాలు సహకరిస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక, సామాజిక సమానత్వం, రాజ్యాంగ పరిరక్షణ జరగాలంటే ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీనే ప్రత్యామ్నాయమని ఆయన స్పష్టం చేశారు. విజయవాడ ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో శనివారం మీటి ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతాజీ సుభాష్‌చంద్రబోస్ జీవిత విశేషాలతోపాటు ప్రస్తుత రాజకీయాలు, ఏఐఎఫ్‌బీ భవిష్యత్ కార్యక్రమాలను వివరించారు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా నేతాజీ రాజీ లేని పోరాటాన్ని సాగించారన్నారు. స్వాతంత్య్రానంతరం దేశాన్ని రక్షించు - దేశాన్ని మార్చు నినాదంతో దేశ పునర్నిర్మాణానికి నేతాజీ నడుం బిగించారని తెలిపారు. ఆ మహానీయుని పేరును ముందు తరాలకు చెందిన వారు తమ పిల్లలకు పెట్టుకున్నారని, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ సహా అనేక రాష్ట్రాల్లో సుభాష్‌చంద్రబోస్ పేరు వినిపిస్తోందన్నారు. నేతాజీ జయంతి రోజైన జనవరి 23వ తేదీన ‘దేశభక్తి దినం’గా ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అక్టోబర్ 21వ తేదీన ఐఎన్‌ఏ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా పలు కార్యక్రమాలను నిర్వహించాలని ఫార్వర్డ్‌బ్లాక్ నిర్ణయించిందన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులు, యువతను భాగస్వామ్యం చేస్తూ ‘జన చేతర సంకల్ప యాత్ర’ను చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.
అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ 18వ జాతీయ మహాసభలు ఈ ఏడాది డిసెంబర్ నెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఐదు రోజులపాటు కోల్‌కతలో నిర్వహిస్తున్నట్లు బిశ్వాస్ పేర్కొన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు నిమ్మరాజు చలపతిరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐజేయూ ఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్‌కే బాబు, విజయవాడ అర్బన్ అధ్యక్ష, కార్యదర్శులు చావా రవి, కొండా రాజేష్, ఆర్ వసంత్ తదితరులు పాల్గొన్నారు.