ఆంధ్రప్రదేశ్‌

చదువుకున్న అజ్ఞాని జీవీఎల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 22: ప్రకృతి వ్యవసాయంలో నూతన పోకడలను అవిష్కరించి వాటిని విజయవంతంగా అమలు చేసి చూపించిన ఘనత ప్రపంచంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి మాత్రమే దక్కుతుందని శాసన మండలి ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న పేర్కొన్నారు. సాక్షాత్తు ఐక్యరాజ్యసమితి నుంచి చంద్రబాబుకు ప్రకృతి వ్యవసాయంపై ప్రసంగం ఇవ్వాలని ఆహ్వానం అందిందన్నారు. విషయంపై పరిజ్ఞానం లేని బీజేపీ ఎంపీ జీవీయల్ నర్సింహారావు చదువుకున్న అజ్ఞానిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. విజయవాడలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో బుద్దా మాట్లాడుతూ ముఖ్యమంత్రికి ఐక్యరాజ్య సమితి నుంచ వచ్చిన ఆహ్వాన పత్రాలను మీడియాకు చూపించారు. ఈ ఐక్యరాజ్య సమితి నుండి ముఖ్యమంత్రికి ఆహ్వానం రాలేదని బీజేపీ నేతలు ప్రచారం చేయడం వారి అజ్ఞానానికి నిదర్శనమన్నారు. తెలుగు ప్రజలను అవమానించే విధంగాజీవిఎల్ వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. ప్రపంచం మొత్తం ఏపీ వైపు పెట్టుబడుల కోసం చూస్తోందన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చంద్రబాబుకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయన్నారు. తెలుగు గడ్డపై పుట్టిన బీజేపీ నేతలు తెలుగు ప్రజలకు ద్రోహం చేసే విధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. అనేక దేశాల ప్రతినిధులు సీఎం చంద్రబాబు ప్రసంగం కోసం ఆహ్వానించి అభినందిస్తుంటే కళ్లు ఉండి చూడలేని కబోధిలా జీవిఎల్ వ్యవహరిస్తున్నారన్నారు. విభజన వల్ల నష్టపోయిన ఏపీకి కేంద్రం సహాయం చేయకపోయినా నోరు తెరవలేని బీజేపీ నేతలు చంద్రబాబును, ప్రభుత్వాని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని చెప్పారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని, విజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు తెలిసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తుంటే ఏపీ ప్రజల ఆత్మగౌరం దెబ్బతీసేవిధంగా బీజేపీ నేతలు ప్రవర్తిస్తున్నారని తెలిపారు. గుంట నక్కలు కూడా అసహ్యించుకునేలా బీజేపీ నేతల తీరు ఉందన్నారు. బీజేపీ నేతలకు దమ్ముంటే ఎటువంటి చర్చకైనా సిద్ధమన్నారు. రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరిగిందో చెప్పేందుకు, చూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు ధైర్యముంటే చర్చకు రావాలన్నారు. మంత్రిగా కోట్ల రూపాయల ప్రజలను సొమ్మును దోచుకున్న కన్నాకు అందరూ దోచుకున్న వారిగానే కనిపిస్తున్నారన్నారు. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని కేంద్రం వద్ద తెలుగు వారి పౌరుషం చూపించి ఏపీకి న్యాయం జరిగేలా చూడాలని బుద్దా వెంకన్న హితవు పలికారు.