ఆంధ్రప్రదేశ్‌

ప్రజా విశ్వాసం కోల్పోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 23: ప్రజా వ్యతిరేక విధానాలతో కేంద్రంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు అన్నారు. సరళీకృత ఆర్థిక విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆదివారం జరిగిన సీపీఎం జిల్లా కమిటీ ప్లీనం సమావేశానికి హాజరైన మధు మాట్లాడుతూ ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారన్నారు. మోదీ రాఫెల్ ఒప్పందంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారన్నారు. ఓటమి భయంతో చంద్రబాబునాయుడు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియకుండా ఉందన్నారు. బీజేపీ మతోన్మాదాన్ని చంద్రబాబునాయుడు వ్యతిరేకించడం లేదన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మంతెన సీతారాం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేశాయన్నారు. గతంలో భోఫోర్స్ కుంభకోణం కంటే రాఫెల్ కుంభకోణం పెద్దదన్నారు. మోదీ పాలనలో దళితులు, మహిళలు, చిన్నారులపై దాడులు పెరిగాయన్నారు. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నా, మతోన్మాదులు పేట్రేగిపోతున్నా చంద్రబాబునాయుడు కిమ్మనకుండా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదన్నారు. ముఖ్యమంత్రి బీజేపీపై చేస్తున్న పోరాటం నమ్మశక్యం కాదన్నారు. కాంగ్రెస్, బీజేపీ, వైసీపీ, టీడీపీకి వ్యతిరేకంగా విశాల ఉద్యమాన్ని నిర్మిస్తున్నామన్నారు. జనసేన, సీపీఎం, సీపీఐతో నూతన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మిస్తున్నామన్నారు. సమావేశంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు బి రమాదేవి, భద్రాచలం తాజా మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సీఐటీయు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, సీసీఎం రాజమహేంద్రవరం జిల్లా కార్యదర్శి టి అరుణ్, నాయకులు టిఎస్ ప్రకాష్, ఎం నాగేశ్వరరావు, ఎస్ ఎస్ మూర్తి, పోలిన వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.