రాష్ట్రీయం

అలరించిన కూచిపూడి నృత్యాంశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూచిపూడి, జూలై 10: అఖిల భారత కూచిపూడి నాట్య కళామండలి, కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో కృష్ణా జిల్లాలోని నాట్యక్షేత్రం కూచిపూడి సీతామహాలక్ష్మి ఫంక్షన్ హాలులో ఆదివారం అన్నమాచార్య 608వ జయంతి నాట్యోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈసందర్భంగా హైదరాబాద్, వరంగల్, కొత్తగూడెం, తెనాలి, తణుకు, విజయవాడ, తాడేపల్లిగూడెం, పార్వతీపురం, ఏలూరు, తదితర ప్రాంతాల నుండి 30 మంది నాట్యాచార్యులు, 300 మంది కళాకారులతో ప్రదర్శించిన అన్నమాచార్యుల సంకీర్తన కూచిపూడి నృత్యాంశాలు పండిత పామరులను సైతం అలరించాయి. కొత్తగూడెంకు చెందిన సీతాలక్ష్మి ప్రసాద్ బృందం ప్రదర్శించిన ప్రత్యేక అంశం ప్రేక్షకులను తన్మయపర్చింది. చిన్నారుల బుడిబుడి నృత్యాలు పులకింపజేశాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం శ్రీకృష్ణాశ్రమం నిర్వాహకులు ముత్తీవి గౌరాకృష్ణ, పద్మశ్రీ గొరిపర్తి నరసింహరాజు యాదవ్, రైల్వే బోర్డు సభ్యుడు చిరువోలు బుచ్చిరాజు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం... వినరో భాగ్యము విష్ణు కథ.. అంశాన్ని ప్రదర్శిస్తున్న కళాకారులు