ఆంధ్రప్రదేశ్‌

మోదీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), అక్టోబర్ 5: రాజ్యాంగ బద్ద సంస్థలను చేతుల్లో పెట్టుకున్న ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలతో మైండ్ గేమ్ ఆడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ విమర్శించారు. మోదీ బెదిరింపులకు బయపడే ప్రసక్తే లేదన్న ఆయన కక్ష సాధింపు చర్యలు ఇకనైనా మానుకోవాలన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలోని టీడీఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రానికి ఎవరు ఎదురు తిరిగితే వారిపై రాజ్యాంగ బద్ధ సంస్థలను మోదీ ప్రయోగిస్తున్నారని చెప్పారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ మోడీ, ఈడీని, ఐటీ సోదాలు జరిపించి భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ బద్ధ సంస్థలు మోదీ చేతిలో కీలు బొమ్మలుగా మారాయని వ్యాఖ్యానించారు. ప్రత్యర్థులను ఇబ్బందులు పెట్టడానికి కోర్టులను సైతం పక్కదారి పట్టిస్తున్నారని మండి పడ్డారు. ఓటుకు నోటు కేసు వలన ఏమీ కాదన్నారు. అసలు అది కేసే కాదన్న ఆయన దీనిపై పలుమార్లు హైకోర్టు కేసులు కొట్టి వేసిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా మోదీ కుతంత్రాలు మానుకుని రాష్ట్రానికి న్యాయ సమ్మతంగా రావాల్సిన విభజన అంశాలతో పాటు హామీలను నెరవేర్చి తన చిత్తశుద్దిని నిరూపించుకోవాలన్నారు.
కేసీఆర్‌కు మూడో కన్ను ఎక్కడుందో చెప్పాలి: డొక్కా
తెలంగాణా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు మూడో కన్ను ఎక్కడ ఉందో స్పష్టత ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ శాసనమండలి విప్ డొక్కా మాణిక్యవరప్రసాద్ డిమాండ్ చేశారు. పురాణాల ప్రకారం శివుడికి మాత్రమే మూడో కన్ను ఉంటుందని, మనుషులకు ఉండదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు, వాడిన బాష అసభ్యకరంగా ఉందన్నారు. 7మండలాల విలీనంపై కేసీఆర్ వ్యాఖ్యలపై జగన్, పవన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. తనకు రాజకీయ భిక్షపెట్టిన చంద్రబాబుపై విమర్శలు చేసినందుకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.