ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వాసుపత్రుల్లో పోస్టుల భర్తీకి 9న నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, అక్టోబర్ 6: రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో కొత్తగా 155 సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్టులు, 35 డెంటిస్టు పోస్టుల రెగ్యులర్ రిక్రూట్‌మెంట్‌కు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని రాష్ట్ర వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ పీ దుర్గాప్రసాదరావు తెలిపారు. ఈ పోస్టుల భర్టీకి ఈ నెల 9వ తేదీన నోటిఫికేషన్ ఇస్తున్నామన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలోని జిల్లాసమగ్ర ప్రభుత్వ వైద్యశాలలో త్వరలో 20 పడకల ఐసీయూ సదుపాయంతో పూర్తివైద్య సేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. శనివారం తెనాలి ప్రభుత్వ వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ వైద్యశాలలో అత్యవసర వైద్యం అందించేందుకు ఐసీయూ సదుపాయం లేకపోవటంవల్ల ఎంతోమంది లక్షల ఖర్చుచేసి ప్రైవేటు వైద్యశాలలకు వెళుతున్నారన్నారు. ఇకనుంచి అటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో 20 పడకల ఐసీయూ సదుపాయాన్ని కల్పించేందుకు నిర్ణయించినట్లు పేర్కొన్నారు. మొదటి దశగా రాష్ట్రంలోని 7 జిల్లా ప్రభుత్వ వైద్యశాలల్లో ఈ సదుపాయం కల్పిస్తుండగా వాటిలో తెనాలి వైద్యశాల ఉందని కమిషనర్ తెలిపారు. ఈనెల 15న ఏలూరు జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఐసీయూ యూనిట్‌ను ప్రారంభిస్తుండగా మరో మూడు మాసాల్లో మిగిలిన ఆరు వైద్యశాలల్లోనూ ఈయూనిట్ ప్రారంభిస్తామన్నారు. అనంతరం వైద్యశాలలో ఐసీయూ నిర్మాణం చేయనున్న స్థలాన్ని ఆయన సూపరింటెండెంట్ డాక్టర్ సనత్‌కుమారితో కలసి పరిశీలించారు. ఐసీయూ యూనిట్ నిర్మాణానికి ఏపీహెచ్‌ఎంహెచ్‌ఐడీసీ నుండి బడ్జెట్ కూడా మంజూరైందన్నారు. అలాగే అన్ని జిల్లాప్రభుత్వ వైద్యశాలల్లో ఎంఆర్‌ఐ స్కానింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే తెనాలిలో ఎంఆర్‌ఐ పరికరం ఉందని, దీనిని నెల రోజుల్లో రోగులకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఎక్కడైతే పాత సీటీస్కాన్ యంత్రాలుండి ఇబ్బంది కరమైన పరిస్థితులు ఉన్నాయో వాటిప్రదేశంలో కొత్తస్కాన్‌లను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. కొన్ని ఏరియా వైద్యశాలల్లోనూ సీటీస్కాన్ సదుపాయం కల్పించినున్నట్లు తెలిపారు. తెనాలి వైద్యశాలలో సివిల్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మరో మూడు మాసాల్లో వాటిని భర్తీచేస్తామన్నారు. అదే విధంగా ఏపీలోని మరో 6 వైద్యశాలల్లో కేవలం గర్భిణుల కోసం ప్రత్యేక ఐసీయూ సదుపాయం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ డాక్టర్ ప్రసన్నకుమార్, ఏఓ డాక్టర్ రవి, ఆర్‌ఎంఓ డాక్టర్ సురేష్, క్యాలిటీ మేనేజర్లు వాసురాజు, వాసు తదితరులు పాల్గొన్నారు.